English   

సినీ నటి టార్గెట్ గా కాల్పులు....అండర్ వరల్డ్ పనేనా ?

Bike-borne Men Open Fire at Kochi Beauty Parlour Owned by 'Madras Cafe' Actress Leena Maria Paul
2018-12-16 12:50:06

మలయాళ సినీ నటి, మోడల్ లీనా పాల్‌పై బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కొచ్చిలోని పానంపిల్లీలో ఉన్న ఆమెకు చెందిన బ్యూటీ పార్లర్ వద్ద శనివారం మధ్యాహ్నం 3:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటన జరిగిన సమయంలో లీనా తన బ్యూటీ పార్లర్‌ నెయిల్‌ ఆర్టిస్ట్రీ లో ఉన్నారు. అయితే పార్లర్‌ బిజీగా ఉండటంతో దుండగులు బయటి నుంచే ఎయిర్‌ గన్స్‌తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అండర్ వరల్డ్‌తో ఆర్థిక పరమైన అంశాల్లో విభేదాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోందని పేర్కొన్నారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఎయిర్ గన్స్ ఉపయోగించినట్టు పోలీసులు తెలిపారు. పార్లర్ వద్ద, ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు.  గతంలో లీనాపై పలు ప్రాంతాల్లో చీటింగ్ కేసులు నమైదయ్యాయి. 2013, 2015లలో చీటింగ్‌ కేసుల్లో ఈమె అరెస్ట్‌అయినట్టుగా పోలీసులు తెలిపారు. జాన్‌ అబ్రహం హీరోగా తెరకెక్కిన మద్రాస్‌ కేఫ్‌తో పాటు మోహన్‌ లాల్ రెడ్‌చిల్లీస్‌ సినిమాల్లో లీనా కీలక పాత్రల్లో నటించారు.
 

More Related Stories