English   

బడ్జెట్ 40కోట్లు.. కలెక్షన్స్ 500కోట్లు ..

sanju
2018-07-15 12:30:24

బయోపిక్ లు బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న టైమ్ ఇది. బయోపిక్ రావడమే ఆలస్యం.. బ్లాక్ బస్టర్ అనేస్తున్నారు ఆడియన్స్. అలా లేటెస్ట్ గా బాలీవుడ్ లో వచ్చిన సంజు బాక్సాఫీస్ ను ఊపేస్తోంది. ఫస్ట్ వీక్ లోనే రెండు వందలకోట్లు కొల్లగొట్టిన సంజు ఇప్పుడు మరో రికార్డ్ క్రియేట్ చేసింది. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ మరోసారి తన రేంజ్ ఏంటో కంటెంట్ తోనే కాదు కలెక్షన్స్ తో సహా ప్రూవ్ చేసుకున్నాడు. రాజ్ కుమార్ హిరాణీకి ఓ ప్రత్యేకత ఉంది. ఏ కథనైనా హానెస్ట్ గా చెబుతాడని. సంజు విషయంలోనూ అదే ప్రయత్నం చేశాడు. కొన్ని విమర్శలు ఉన్నా.. ఓవరాల్ గా సంజు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. 

సంజు పాత్రలో రణ్ బీర్ కపూర్ నటనకు ఫిదా కాని వారు లేరు. ఇండియాలోనే కాదు.. వాల్డ్ వైడ్ గా సంజుకు అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. అప్లాజ్ మాత్రమే కాదు.. అదిరిపోయే కలెక్షన్స్ తోనూ దుమ్మురేపుతున్నాడు సంజు.. ఫస్ట్ వీక్ కే రెండు వందల కోట్లు కొల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసిన సంజు రెండు వారాల తర్వాత 500కోట్ల మార్క్ ను చేరి సత్తా చాటాడు.

కేవలం 40కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా సంజు. రిలీజ్ అయిన ఫస్ట్ డే హయ్యొస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన సంజు రెండు వారాల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా 500కోట్ల 43లక్షలతో స్టడీగా ఉంది. ఇక ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్ల తర్వాత రణ్ బీర్ కపూర్ కెరీర్ లో ఇదే హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా. మొత్తంగా సంజు విమర్శలను దాటి విజయతీరాలు చేరిన సినిమాగా కొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. 

More Related Stories