English   

వాట్ ఏ షాక్.. ముగ్గురు సిఎం బ‌యోపిక్ లు..!

NTR-Biopic
2018-06-30 17:39:31

ఇది నిజంగా ఓ షాక్. ఒకేసారి ముగ్గురు ముఖ్య‌మంత్రుల బ‌యోపిక్ లు తెలుగులో వ‌స్తున్నాయి. అది కూడా ఒకేసారి తెర‌పైకి రానున్నాయి. రిలీజ్ కూడా ఒకేసారి అవుతాయేమో మ‌రి..? ఇప్ప‌టికే వైఎస్ఆర్ బ‌యోపిక్ యాత్ర మొద‌లైపోయింది. ఇందులో ఆయ‌న జీవితాన్ని మొత్తం చూపించ‌క పోయినా.. వైఎస్ జీవితంలో జ‌రిగిన చాలా సంఘ‌ట‌న‌ల‌ను చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ‌. మ‌మ్ముట్టి ఇందులో వైఎస్ఆర్ గా న‌టిస్తుండ‌టం మ‌రో విశేషం. ఇదే సినిమాపై అంచ‌నాలు పెంచేసింది. ఇక ఇదే స‌మ‌యంలో ఎన్టీఆర్ బ‌యోపిక్ పై కూడా ఎక్క‌డ‌లేని అంచ‌నాలు ఉన్నాయి. ఈయ‌న పాత్ర‌లో ఏకంగా బాల‌య్య న‌టిస్తుండ‌టంతో ఆస‌క్తి పెరిగిపోతుంది. పైగా క్రిష్ ద‌ర్శ‌కుడు కావ‌డం మ‌రో హైలైట్. అస‌లే ఈ మ‌ధ్య ఈయ‌న బ‌యోపిక్ లు తీయ‌డంలో ఎక్స్ ప‌ర్ట్ అయిపోయాడు. ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల త‌ర్వాత ఇప్పుడు కేసీఆర్ బ‌యోపిక్ ఉద్య‌మ‌సింహం కూడా వ‌స్తుంది. ఇది కూడా వైఎస్ఆర్ త‌ర‌హా సినిమానే. అక్క‌డ పాద‌యాత్ర‌ను హైలైట్ చేస్తే.. ఇక్క‌డ కేసీఆర్ దీక్ష‌ను హైలైట్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు అల్లూరి కృష్ణంరాజు. ఇందులో కేసీఆర్ పాత్ర‌లో సీనియ‌ర్ న‌టుడు నాజ‌ర్ న‌టిస్తున్నారు. వీటిలో వైఎస్ఆర్ యాత్ర‌.. కేసీఆర్ ఉద్య‌మ‌సింహం ఇప్ప‌టికే ప‌ట్టాలెక్కాయి. ఇక ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా అక్టోబ‌ర్ నుంచి మొద‌లుకానుంది. మ‌రి ఈ ముగ్గురు ముఖ్య‌మంత్రుల్లో ఏ బ‌యోపిక్ కు ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఓటేస్తారో చూడాలిక‌..!

More Related Stories