English   

నాని.. అనుకోకుండా ఒక స్టార్..

natural star nani
2018-02-24 12:40:09

తెలుగు ఇండ‌స్ట్రీ అనేది మ‌హాస‌ముద్రం. ఇక్క‌డ స్టార్స్ అంతా వార‌సులే. ఆల్రెడీ ఎప్ప‌ట్నుంచో పాతుకుపోయిన సామ్రాజ్యాలే ఇక్క‌డ ఉన్నాయి. ఈ స్టార్ హీరోల వార‌సులే మ‌ళ్ళీ స్టార్స్ గా వ‌స్తున్నారు. ఇలాంటి చోట అస‌లు బ‌య‌టి వాళ్ళ‌కు వ‌చ్చే ఛాన్సే లేకుండా పోయింది. ఈ స‌మ‌యంలో ఒక్క హీరో మాత్రం రాకెట్ లా దూసుకొచ్చాడు. అత‌డే న‌వీన్ బాబు గంటా. మ‌నం అంతా ముద్దుగా నాని అని పిలుచుకుంటున్నాం ఇప్పుడు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. క్లాప్ అసిస్టెంట్ గా కూడా చేసి.. హీరోగా మారి.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల్లో ఒక్క‌డిగా నిలిచాడు నాని. అస‌లు నాని సినిమా వ‌స్తుందంటే ఇంకో మాట లేకుండా హిట్ అనాల్సిందే. అంత‌గా నాని ఇప్పుడు దున్నేస్తున్నాడు. న్యాచుర‌ల్ స్టార్ నుంచి సూప‌ర్ స్టార్ గా అడుగులేస్తున్నాడు నాని. ఓ చిరంజీవి.. ర‌వితేజ‌.. ఇప్పుడు నాని. గ‌త కొన్ని ద‌శాబ్ధాల తెలుగు ఇండ‌స్ట్రీని తీసుకుంటే వీళ్ళు త‌ప్ప మ‌రో స్టార్ ఎవ‌రూ అండ లేకుండా ఎద‌గ‌లేదు. ఇప్పుడు నాని వ‌చ్చాడు ఈ లిస్ట్ లోకి. వ‌ర‌స‌గా ఎనిమిది విజ‌యాలు అందుకుని ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నాడు నాని. ప్ర‌స్తుతం కృష్ణార్జున యుద్ధంతో బిజీగా ఉన్నాడు. దాంతో పాటు నాగార్జున‌తో శ్రీరామ్ ఆదిత్య మ‌ల్టీస్టార‌ర్.. హ‌ను రాఘ‌వ పూడి సినిమా.. విక్ర‌మ్ కే కుమార్ సినిమాలకు క‌మిట‌య్యాడు నాని. ఫిబ్ర‌వ‌రి 24న నాని పుట్టిన‌రోజు. ఇలాంటి పుట్టినరోజుల‌తో పాటు ఇలాంటి మంచి సినిమాలు ఇంకా చేయాల‌ని కోరుకుందాం..! హ్యాపీ బ‌ర్త్ డే టూ నాని..!

More Related Stories