English   

బీజేపీలోకి చిరంజీవి ?

 Chiranjeevi
2019-06-25 14:44:14

ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎలా అయినా పాగా వేయాలని చూస్తున్న కమలనాధులు అందుకు తగ్గ ఎటువంటి అవకాశాన్ని వదులుకోవడంలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నా రాజాకీయ నిరుద్యోగం అనుభవిస్తున్న చిరంజీవిని బీజేపీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో పార్టీలో ఉన్నా లేనట్టుగా ఉన్న చిరంజీవి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం కూడా చేయలేదు. 2018 ఏప్రిల్ లో రాజ్యసభ సభ్యత్వం ముగియడంతో అప్పటినుండి ఆయన రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. తన సైరా సినిమా షూటింగుతో బిజీ అయిపోయి రాజకీయాలతో తనకు ఏ సంబంధం లేదు అన్నట్లుగా ఉన్న ఆయనని బీజేపీ చేర్చుకోవాలని భావిస్తోందట. చిరంజీవిని పార్టీలో చేర్చుకొని కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తోందట. ఏపీలో దాదాపు సింహభాగం నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నేపధ్యంలో చిరంజీవిని పార్టీలోకి తీసుకుని ఆయనకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చి ఆయన్ని యాక్టివ్ చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాంమాధవ్, కన్నా లక్ష్మీ నారాయణ సహా కొందరు చిరంజీవితో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే సోదరుడు పవన్ కళ్యాణ్ కి ఎదురు వెళ్తూ ఆయన బీజేపీలో చేరతారా ? అనేది ఆశ్చర్యార్ధకంగా మారింది.

More Related Stories