English   

రేసుగుర్రం విలన్ కు వై కేటగిరీ భద్రత

BJP MP Ravi Kishan
2020-10-01 16:33:27

రేసుగుర్రం సినిమా విలన్, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇటీవల తనకు వై ప్లస్ కేటగిరీ భద్రత కావాలంటూ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయనకు వైకేటగిరీ భద్రతను ఏర్పాటు చేశారు. దాంతో ఆయన ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా బాలీవుడ్ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం పై రవికిషన్ స్పందించారు. పరిశ్రమలో విచ్చల విడిగా డ్రగ్స్ వాడుతున్నారంటూ ఆరోపంచారు. దాంతో జయా బచ్చన్ సహా పలువురు రవి కిషన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. మాధకద్రవ్యాల పై మాట్లాడినందుకు తనకు తన కుటుంబానికి హాని ఉందని వై కేటగిరి భద్రత కావాలని కోరారు. మరోవైపు డ్రగ్స్ కేసుపై మాట్లాడినందుకు ఆయనను ఒకే రోజు రెండు ప్రాజెక్ట్ ల నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు ప్రాజెక్ట్ ల నుండి ఒకేరోజు తొలగొంచడం తనను షాక్ కు గురి చేస్తుందని అన్నారు. ఎవరు ఏం చేసినా తాను భయపడను అని అన్నారు. డ్రగ్స్ విషయంపై మరింత గట్టిగా మాట్లాడతాననని పేర్కొన్నారు. లోక్ సభలో తన గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. తనకు వైకేటగిరి భద్రతను కల్పించినందుకు మహరాజ్ గురూజీ యోగి అదిత్యనాథ్ కు ఋణపడి ఉంటానని పేర్కొన్నారు.
 

More Related Stories