English   

రాజమౌళికి బీజేపీ ఎంపీ వార్నింగ్..చరిత్ర తెలుసుకోండి

RRR
2020-10-27 21:44:26

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా..ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. కాగా చిత్ర యూనిట్ రాంచరణ్ బర్త్ డే సంధర్భంగా చరణ్ కో సంబందించిన టీజర్ ను విడుదల చేసి సర్ప్రైజ్ చేసింది. అయితే లాక్ డౌన్ కారణంగా ఎన్టీఆర్ బర్త్ డే నాటికి ఎన్టీఆర్ కు సంబంధించిన టీజర్ మేకింగ్ పూర్తవ్వలేదు. దాంతో లాక్ డౌన్ తరవాత రాజమౌళి ఎన్టీఆర్ టీజర్ ను పూర్తిచేసి ఇటీవల కొమురంభీమ్ జయంతి సందర్భంగా విడుదల చేశారు. అయితే ఎన్టీఆర్ కొమురంభీమ్ టీజర్ పై ప్రశంసలతో పాటు కొన్ని వివాదాలు కూడా తలెత్తుతున్నాయి.టీజర్ లో ఎన్టీఆర్ తలకు ధరించిన టోపీ సన్నివేశాన్ని తొలగించాలంటూ ఇప్పటికే ఆదివాసీలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. 

ఇక ఇప్పుడు తాజాగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ కూడా ఆ సన్ని వేశాన్ని తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అంతే కాకుండా సినిమా విడుదల చేస్తే థియేటర్ లను కూడా తగలబెట్టే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. మీ కలెక్షన్ల కోసం మా ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే సహించేది లేదని అన్నారు. నైజాం కు వ్యతిరేకంగా కొమురంభీమ్ పోరాటం చేసి అమరుడయ్యాడాని అన్నారు. కొమురంభీమ్ ను చంపినవాళ్ళ టోపీ ఆయన తలపై పెట్టడం ఏంటని అది ఆదివాసీలను అవమానించడమే అని పేర్కొన్నాడు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని లేదంటే మర్యాదగా ఉండదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక బాపురావ్ వ్యాఖ్యలపై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి.

More Related Stories