English   

సౌత్ సినిమాల్లో సందడి చేసిన బాలీవుడ్ హీరోయిన్స్ వీళ్లే..

telugu
2020-05-31 07:32:45

బాలీవుడ్ అంటేనే భరించలేని ఇండస్ట్రీ అని అర్థం. అక్కడి హీరోయిన్లు ఇక్కడ నటించాలంటే అంత చిన్న విషయం కాదు. వాళ్లను ఇక్కడికి తీసుకురావాలంటే నిర్మాతలకు చుక్కలు కనిపిస్తాయి. అలాంటిది కొందరు ముద్దుగుమ్మలు మాత్రం అప్పుడప్పుడూ బాలీవుడ్ విడిచి సౌత్‌లో నటించారు. మరి వాళ్లెవరు.. ఏ సినిమాలు చేసారో ఇప్పుడు చూద్దాం..

కత్రినా కైఫ్: అప్పటికి ఇంకా బాలీవుడ్‌లో క్రేజ్ లేనపుడే వెంకటేష్ మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కత్రినా. ఆ తర్వాత బాలయ్యతో అల్లరి పిడుగు సినిమాలో నటించింది. ఆ వెంటనే బాలీవుడ్ వెళ్లి సూపర్ స్టార్ అయిపోయింది.

విద్యా బాలన్: ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల కోసం విద్యా బాలన్‌ను హీరోయిన్‌గా ట్రై చేసినా కూడా ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మళ్లీ తర్వాత మాయం అయిపోయింది విద్య.

ఐశ్వర్యారాయ్: బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా చాలా కాలం పాటు చక్రం తిప్పిన ఐశ్వర్యా రాయ్ కూడా మొదట సౌత్ సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకుంది. ఇద్దరు, ప్రియురాలు పిలిచింది లాంటి సినిమాలు చేసిన తర్వాత తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన రావోయి చందమామ సినిమాలో ఐటం సాంగ్ కూడా చేసింది ఐష్.

ప్రీతి జింటా: తెలుగులో ప్రతీ జింటా కూడా కెరీర్ కొత్తగా మహేష్ బాబుతో రాజకుమారుడు.. వెంకటేష్‌తో ప్రేమంటే ఇదేరా సినిమాలు చేసింది.

దీపిక పదుకొనే: అసలు దీపిక సౌత్‌లో నటించిందా అనే అనుమానాలు వస్తున్నాయి కదా.. కన్నడ అమ్మాయి కావడంతో కెరీర్ కొత్తలో ఉపేంద్ర హీరోగా వచ్చిన ఓ సినిమాలో నటించింది. దాంతో పాటు తెలుగులో జయంత్ సి పరాన్జీ తెరకెక్కించిన లవ్ ఫరెవర్ సినిమాలో ఐటం సాంగ్ చేసింది.

ప్రియాంక చోప్రా: మిస్ వరల్డ్ పీఠం అందుకున్న తర్వాత తమిళంలో విజయ్ హీరోగా నటించిన తమిళన్ సినిమాతోనే హీరోయిన్‌గా పరిచయమైంది ప్రియాంక చోప్రా. ఆ తర్వాతే హిందీలో స్టార్ అయిపోయింది.

ట్వింకిల్ ఖన్నా: వెంకటేష్ హీరోగా వచ్చిన శీను సినిమాలో నటించింది అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా.

శిల్పా శెట్టి: సాహసవీరుడు సాగరకన్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శిల్పా శెట్టి.. ఆజాద్, వీడెవడండీ బాబూ, భలేవాడివి బాసూ లాంటి సినిమాల్లో నటించింది.

బిపాషా బసు: హిందీలో సెక్సీ ఇమేజ్ తెచ్చుకున్న బిపాషా తెలుగులో మహేష్ హీరోగా వచ్చిన టక్కరి దొంగలో నటించింది.

లిసా రే: టక్కరి దొంగ సినిమాలో బిపాషాతో పాటు లిసా రే కూడా నటించింది.

అమీషా పటేల్: కహో నా ప్యార్ హై సినిమాతో హిందీలో స్టార్ అయిన అమీషా పటేల్.. బద్రి సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైంది. ఆ తర్వాత నరసింహుడు, నాని, పరమవీరచక్ర లాంటి సినిమాలు చేసింది అమీషా.

యామీ గౌతమ్: అల్లు శిరీష్ హీరోగా నటించిన గౌరవం సినిమాతోనే యమీ హీరోయిన్‌‌గా పరిచయమైంది.

వాణి కపూర్: నాని హీరోగా వచ్చిన ఆహా కళ్యాణం సినిమాతో సౌత్ ఆడియన్స్‌కు పరిచయమైంది వాణి కపూర్. ఆ తర్వాత బాలీవుడ్‌కే పరిమితం అయిపోయింది.

రవీనా టాండన్: అప్పట్లో బాలయ్య హీరోగా వచ్చిన బంగారు బుల్లోడు సినిమాతో సంచలనం సృష్టించింది రవీనా టాండన్. ఆ తర్వాత నాగార్జున, మోహన్ బాబు లాంటి హీరోలతో నటించింది.

మనీషా కోయిరాలా: బొంబాయి సినిమాతో సౌత్ ఆడియన్స్‌కు చేరువైన మనీషా కోయిరాలా.. దానికంటే ముందే క్రిమినల్ సినిమాతో మాయ చేసింది.

గ్రేసీ సింగ్: సంతోషం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది గ్రేసీ సింగ్. తర్వాత మోహన్ బాబుతో తప్పుచేసి పప్పుకూడులో నటించింది.

సారా జైన్: పవన్ కళ్యాణ్ పంజా సినిమాతో పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు.

అయేషా టకియా: పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ సినిమా అయేషా టకియా నటించిన ఏకైక సౌత్ సినిమా.

అమృతా సింగ్: అతిథి సినిమాతో నిజంగానే అతిథిలా వచ్చి వెళ్లిపోయింది అమృత సింగ్. ఆ తర్వాత కథలు నచ్చలేదని సౌత్‌కు రాలేదు ఈ బ్యూటీ.

షాజన్ పదాంసీ: రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరెంజ్ సినిమాతో షాజన్ పదాంసీ పరిచయం అయింది. కానీ ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.

 

More Related Stories