English   

సౌత్ హీరోల మీద బాలీవుడ్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ !

Bollywood director Rohit Shetty sensational comments on south heros
2019-03-15 14:17:25

ఒకప్పుడు బాలీవుడ్ సినిమా అంటే ఆ రేంజ్ వేరు, దేశం మొత్తం మీద ముందుగా ఏర్పడిన ఈ సినిమా రంగం మిగతా ఆన్ని బాషల వాళ్లకి సవాల్ విసురుతూ ఉంటుంది. అయితే తాజాగా కొన్ని దక్షిణాది సినిమాలు వారి సినిమాలతో పోటీ పడుతూ ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు మ‌న తెలుగు హీరోల‌పై బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. బాలీవుడ్ లో ఐదు వంద కోట్ల సినిమాలు, మూడు రెండు వందల కోట్ల సినిమాలు తన లిస్టులో ఉన్న ఈ డైరెక్టర్ తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఫరిద్దూన్ షహర్యార్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ద‌క్షిణాదిన ఉన్న టాప్ హీరోలంద‌రిపై సేన్సేషనల్ కామెంట్స్ చేసాడు ఈ టాప్ డైరెక్టర్. ద‌క్షిణాదిన చిరంజీవి, విజ‌య్, ర‌జినీకాంత్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఉంటార‌ని వాళ్ల సినిమాలు యావ‌రేజ్ ఉన్నా కూడా క‌లెక్ష‌న్లు మాత్రం ఫుల్లుగా వ‌స్తాయ‌ని మూడు రోజుల పాటు టికెట్స్ కూడా దొర‌క‌వ‌ని వాళ్ల అభిమానులే అంత‌గా సినిమా చూస్తార‌ని అంటున్నాడు. వీళ్ళు తమ ఫ్యాన్స్ ని బాగా చూసుకుంటారని అందుకే వీళ్ళకి అన్ని రాష్ట్రాల్లోనూ ఫ్యాన్ బేస్ పెద్దదిగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. 

More Related Stories