English   

బాలీవుడ్ కి గట్టి పోటీ ఇస్తున్న టాలీవుడ్ 

sye raa saaho
2019-08-24 14:54:50

నిన్నా మొన్నటి దాకా బాలీవుడ్ అంటే ఖాన్ ల అడ్డా, ఎప్పుడైతే అక్కడ బాహుబలి రంగప్రవేశం చేసి రికార్డులు బద్దలు కొట్టాడో అప్పటి నుండి సీన్ మారింది. అంతకు ముందు దాకా అక్కడ మమ్మల్ని కొట్టే మొనగాళ్లు లేరు. మేమే తోపులం అనేలా ఉండే సీను  మారింది. బాహుబలి మానియా ఖాన్ ల క్రేజ్ ఒక్కసారిగా తగ్గించేయలేక పోయినా ఆ ప్రభావం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. బాహుబలి తర్వాత మళ్లీ అలాంటి రికార్డులు కొట్టేయాలని తంటాలు పడిన అమీర్ ఖాన్ అనుకున్నది సాధించలేకపోయాడు. అమితాబ్ సహా భారీ కాస్టింగ్ తో అమీర్ చేసిన `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` ఎంతో దారుణంగా ఫెయిలైంది.
 ఇక ఈ మధ్య షారూక్ సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. మరోపక్క సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు సక్సెస్ వైపు సాగుతున్నా వైఫల్యాలు కూడా ఎదురవుతూనే ఉన్నాయి. మరో పక్క సల్మాన్ `భారత్` ఫర్వాలేదనిపించినా ఆశించినంత వసూళ్లు సాధించలేదు. ఇక ఇదే మంచి తరుణం టాలీవుడ్ బాలీవుడ్ మీద పట్టు సాధించేందుకు అని అంటున్నారు. ఇప్పుడు, సై రా నరసింహ రెడ్డి, సాహో సినిమాలు ఇప్పుడు బాహుబలి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నాయి. ఇప్పటికే, బాలీవుడ్ మీద టాలీవుడ్ దృష్టి సారించినట్టు అయ్యింది. త్వరలో విడుదల కానున్న ఈ రెండు పెద్ద సినిమాలు బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ నమోదు చేస్తే టాలీవుడ్ రేంజ్ ని పెంచినట్టు అవుతుంది.

More Related Stories