English   

కోర్టుకెక్కిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్..రెండు కోట్లు డిమాండ్

Kangana Ranaut
2020-09-28 13:22:40

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వర్సెస్ మహా సర్కార్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముంబై లో ఉన్న కంగన ఆఫీస్ ను అధికారులు కూల్చివేశారు. అయితే కంగనా తో శివసేన కు ఉన్న వివాదం కారణంగానే ఆఫీస్ ను కూల్చేశారని టాక్ నడిచింది. ఆ  తరవాత కంగనా కూడా ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మహా సీఎం ఉద్ధవ్ థాక్రే పై మండిపడింది. త్వరలో మీ సర్కార్ కూడా బిల్డింగ్ లాగే కూలిపోతుందని శపించింది కూడా. మరోవైపు తన ఆఫీస్ కూల్చేయడంపై మహారాష్ట్ర గవర్నర్ తో భేటి అయ్యింది. ఇక తాజాగా కంగనా తనకు నష్టపరిహారం కావాలంటూ కోర్టుకెక్కింది. 2 కోట్ల డిమాండ్ చేస్తూ కంగన కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలా ఉండగా కంగన ఇప్పుడు మరో వివాదంలో కూడా చిక్కుకుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా కొంతమంది రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. కాగా కంగన వారిని ఉగ్రవాదులు అంటూ అభివర్ణించింది. దాంతో ఆమెపై  కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటివరకు కంగనాకు సపోర్ట్ చేసినవాళ్ళు కూడా ఆమె రైతులకు వ్యరేకంగా తెచ్చిన బిల్లును సమర్థించడంతో కాంగనాకు అనవసరంగా సపోర్ట్ చేశామని ఫీల్ అవుతున్నారు.

More Related Stories