English   

బొమ్మరిల్లు దర్శకుడితో గోపీచంద్ సాహసం 

Gopichand-bhaskar
2018-03-14 07:50:44

భాస్కర్.. ఫస్ట్ మూవీనే ఇంటిపేరుగా మార్చుకున్న దర్శకుడు. తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ గా మారి ప్రతి హీరోకూ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. తర్వాత పరుగు కాస్త నెమ్మదించినా.. ఆరెంజ్ తో ఓ రేంజ్ ఫ్లాప్ ఇచ్చాడు. ఆరెంజ్ దెబ్బకు మనోడిని ఎంటైర్ ఇండస్ట్రీ  పక్కనబెట్టింది. దీంతో చాలాకాలం ట్రై చేసి హీరో రామ్ తో సినిమా చేశాడు. తన రూట్ మార్చి యాక్షన్ మూవీ చేశాడు. అదే ఒంగోలు గిత్త. ఇది కూడా పోయింది. ఇక అప్పటి నుంచీ దిల్ రాజు క్యాంప్, గీతా ఆర్ట్స్ చుట్టూ తిరుగుతోన్న బొమ్మరిల్లు భాస్కర్ కు ఫైనల్ గా హీరో దొరికాడు. అఫ్ కోర్స్ అతనూ వరుస డిజాస్టర్స్ తో ఉన్నాడనుకోండి.  గోపీచంద్.. మోస్ట్ టాలెంటెడ్ హీరో. అతనికంటూ ఓ ఇమేజ్ ఉంది. సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆ ఇమేజ్ మార్చుకోవాలనుకున్నాడు. కొత్త ఫ్యాన్స్ ను సంపాదించాలనుకున్నాడు. అందుకోసం లౌక్యంగా ట్రై చేసి జిల్ మనిపించినా తర్వాత అది సౌఖ్యంగా లేక ఇబ్బంది పడుతున్నాడు. ఒక్క హిట్ కోసం చకోర పక్షిలా చూస్తోన్న గోపీచంద్ ప్రస్తుతం ఆ హిట్ కోసం పంతం అనే సినిమా చేస్తున్నాడు. ఇది అతనికి 25వ సినిమా. మే లో విడుదల కాబోతోందీ మూవీ. దీని తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేయబోతున్నట్టు టాక్. ఇన్నాళ్లూ తిరిగిన భాస్కర్ ఫైనల్ గా ఓ నిర్మాతను పట్టుకున్నాడు. గోపీచంద్ ఇమేజ్ కు సరిపోయేలా ఓ మంచి కథను కూడా రెడీ చేసుకున్నాడు. ఇక గోపీ ఊ అంటే చాలు.. ఈ కథ సెట్స్ పైకి వెళుతుంది. నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి.. గోపీచంద్ డేట్స్ ఓకే అయితే సినిమా పట్టాలెక్కుతుంది. మొత్తంగా ఈ ఇద్దరిదీ రేర్ కాంబినేషన్. ఒక్కోసారి ఇలాంటి కాంబినేషన్సే రికార్డ్స్ క్రియేట్ చేస్తాయి. రికార్డులు కాకపోయినా ఇప్పటి వరకూ ఉన్న ఫ్లాప్స్ మర్చిపోయేలా ఓ మంచి హిట్ పడితే చాలనే వీరి కోరిక నెరవేరుతుందా..?

More Related Stories