ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్పై బాలీవుడ్ నిర్మాత అభ్యంతరం

దసరా కానుకగా అక్టోబరు 13న ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు రాజమౌళి టీం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాజమౌళి అండ్ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. 'నిజం చెప్పాలంటే RRR విడుదల పట్ల నేనెంతో అసంతృప్తిగా ఉన్నాను. ఇది అన్యాయం. 'మైదాన్' విడుదల తేదీని నేను ఆరు నెలల క్రితమే ప్రకటించాను. అందరం ఒక్కటిగా ఉండి చిత్ర పరిశ్రమను కాపాడాల్సిన ఈ సమయంలో 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఇలా చేయడం నాకు నచ్చలేదు.' అని బోనీ వెల్లడించారు. లెజండరీ ఫుట్ బాల్ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహిత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్ - ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 15న రిలీజ్ అవ్వబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. అయితే ఇప్పుడు అదే సమయానికి 'ఆర్.ఆర్.ఆర్' వస్తే ఆ ఎఫెక్ట్ 'మైదాన్'పై పడే అవకాశం ఉండటంతో బోనీ కపూర్ అయోసెట్అయ్యాడని తెలుస్తోంది.