English   

 బోయపాటితో రామ్ చరణ్ లాస్ట్ ఫైట్..!!

Mega Power Star Ram Charan is currently shooting with Boyapati Srini. Shooting is going on very rapidly than expected. Kaira Advani is acting as heroine. The film has been shot in Hyderabad since 9th of this month. Especially a few sets.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. అనుకున్నదానికంటే చాలా వేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా క్లైమాక్స్ ను ఈ నెల 9 నుంచి హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని సెట్స్ వేశారు. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ అంటే ఏ రేంజ్ లో ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు కదా. కొత్త కుర్రాడు బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన జయజానకి నాయకలోనే రోమాలు నిక్కబొడుచుకునే రేంజ్ లో యాక్షన్స్ సీన్స్ చూపించాడు. ఇక రామ్ చరణ్ సినిమా అంటే ఇంకే రేంజ్ లో ఉంటుందో ఊహించడానికి కూడా ఆస్కారం ఇవ్వడేమో.. ఈ నెలలోనే ఈ క్లైమాక్స్ షూటింగ్ కూడా పూర్తవుతుందని చెబుతున్నారు.

అయితే ఇదే నెలలో రామ్ చరణ్ నుంచి మరో స్పెషల్ ఉంది. రామ్ చరణ్  కెరీర్ లో ది బెస్ట్ మూవీగా రంగస్థలం నిలుస్తుంది. చరణ్ పర్ఫార్మెన్స్ కు దేశవిదేశాల్లోని ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కలెక్షన్స్ పరంగానూ నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నీ రంగస్థలం కొట్టేసింది. సమ్మర్ బరిలో నిలిచిన రంగస్థలం యూనానిమస్ హిట్ గా నిలిచింది. రికార్డ్ సెంటర్స్ లో 50రోజులు కంప్లీట్ చేసుకున్న రంగస్థలం వంద రోజులు కూడా పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ను కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ఇండస్ట్రీలోని చాలామంది పెద్దలను పిలుస్తున్నారని టాక్. మొత్తంగా ఈ నెలంతా హైదరాబాద్ లో రామ్ చరణ్ సందడి అటు షూటింగ్ పరంగా.. ఇటు ఫంక్షన్ పరంగానూ ఉంటుంది.. 

More Related Stories