English   

బోయ‌పాటి ఔట్.. ఇట్స్ అఫీషియ‌ల్..!

boyapati
2018-07-08 12:07:38

అవును.. ఇండ‌స్ట్రీలో ఏ ద‌ర్శ‌కుడు ఎవ‌రితో సినిమా చేయాల‌నుకున్నా కూడా అది ప‌ట్టాలెక్కే వ‌ర‌కు కూడా న‌మ్మ‌డం సాధ్యం కాదు. ముఖ్యంగా ఎందుకో తెలియ‌దు కానీ బోయ‌పాటి విష‌యంలో మాత్రం అనౌన్స్ మెంట్స్ ద‌గ్గ‌రే సినిమాలు ఆగిపోతుంటాయి. ఆ మ‌ధ్య బెల్లంకొండ‌తో అలాగే అయిన త‌ర్వాత రెండేళ్ల‌కు జ‌య జానకి నాయ‌క చేసాడు.. దానికి ముందు నుంచి మ‌హేశ్ తో సినిమా అంటున్నాడు కానీ చేయట్లేదు. ఇప్పుడు చిరంజీవితో సినిమా అనౌన్స్ చేసాడు బోయ‌పాటి. కానీ ఈ చిత్రం ఇప్ప‌ట్లో ఉండేలా క‌నిపించ‌ట్లేదు. ఆ స్థానంలోకి కొర‌టాల శివ వ‌చ్చాడు. ఇప్ప‌టికే ఈయ‌న పెద్దాయ‌న‌కు క‌థ కూడా చెప్పాడు. భ‌ర‌త్ అనే నేనుతో వ‌ర‌స‌గా నాలుగో సారి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం సూప‌ర్ హిట్ కాక‌పోయినా.. 90 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. మ‌హేశ్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈయ‌న ఏం చేస్తాడో అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ ఉంది. 

అఖిల్ తో సినిమా అనుకున్నా అది కాద‌ని ఇప్పుడు చిరంజీవి కోసం క‌థ సిద్ధం చేస్తున్నాడు కొర‌టాల‌. ఈ మ‌ధ్యే మెగాస్టార్ చిరంజీవిని క‌లిసి క‌థ కూడా చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. సోష‌ల్ మెసేజ్ ఉన్న క‌థ‌నే మెగాస్టార్ ఇమేజ్ కు స‌రిపోయేలా అల్లుకున్నాడ‌ని తెలుస్తుంది. పైగా సందేశాత్మ‌క క‌థ‌లు చేయ‌డానికి చిరంజీవి ఎప్పుడూ ఆస‌క్తి చూపిస్తుంటాడు. ఇప్పుడు కొర‌టాల కూడా ఇదే చేసాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కొర‌టాల చెప్పిన లైన్ కి మెగాస్టార్ కూడా ఫిదా అయ్యాడ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈయ‌న సైరాతో బిజీగా ఉన్నాడు. మ‌రో ఏడాది పాటు ఈ చిత్రానికే మెగాస్టార్ అంకితం అవ్వ‌డం ఖాయం. ఇదిలా ఉంటే ఈ చిత్రం త‌ర్వాత బోయ‌పాటి శీనుతో ఓ సినిమా చేయాల్సి ఉంది చిరు. అవ‌స‌రం అనుకుంటే ఈ చిత్రాన్ని ఆపి మ‌రీ కొర‌టాల‌కు జంప్ అయ్యేలా ఉన్నాడు మెగాస్టార్. ఎందుకంటే ప్ర‌స్తుతం బోయ‌పాటి కంటే కొర‌టాల‌కు క‌మ‌ర్షియ‌ల్ రేంజ్ ఎక్కువ‌. వ‌చ్చే ఏడాది మార్చ్ లో ఈ చిత్రం మొద‌లు కానుంది. రామ్ చ‌ర‌ణ్ దీనికి నిర్మాత‌. 

More Related Stories