English   

చ‌ర‌ణ్ కు ఇంకా దొర‌క‌ట్లేదు పాపం..!

ram-charan

దొర‌కాలంటే ముందు పోయిందేంటో తెలియాలి కదా.. పోయిన‌పుడు క‌చ్చితంగా ఆయ‌న ఏదో ఒక‌టి చేసుంటాడు క‌దా..! అయితే ఇక్క‌డ పోయింది ఏమీ లేదు.. కానీ కావాల్సింది మాత్రం ఉంది. అందుకే ఇప్పుడు బోయ‌పాటితో పాటు చిత్ర‌యూనిట్ అంతా దానికోస‌మే వేట సాగిస్తున్నారు. వాళ్లు వేటాడుతున్న‌ది లొకేష‌న్స్ కోసం. బోయ‌పాటి ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేస్తున్నాడు. రంగ‌స్థ‌లం కిక్ లోంచి బ‌య‌టికి వ‌చ్చి బోయ‌పాటితో సినిమాను వేగంగానే పూర్తి చేస్తున్నాడు మెగా వార‌సుడు. ఇప్ప‌టికే ఈ చిత్రం మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. మొన్న‌టి చ‌ర‌ణ్ తో పాటు ప్రశాంత్.. స్నేహ.. కైరాతో పాటు మిగిలిన కీల‌క‌మైన న‌టులు కూడా ఉన్నారు. 

15 రోజుల పాటు ఫ్యామిలీ ఎమోషన‌ల్ సీన్స్ చిత్రీక‌రించాడు బోయ పాటి. ఇదిలా ఉంటే ఇప్పుడు త‌ర్వాతి షెడ్యూల్ లో భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నాడు బోయ‌పాటి. దీనికే లొకేష‌న్స్ చూస్తున్నాడు. యూర‌ప్ జార్జియా లాంటి దేశాల్లోనూ కొన్ని లొకేష‌న్స్ చూసొచ్చినా కూడా ప‌ని జ‌ర‌గ‌లేదు. దాంతో హైద‌ర‌బాద్ లోనే భారీ సెట్ వేసి షూట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఫ్యామిలీ యాక్ష‌న్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నాడు బోయ‌పాటి. గ్యాంగ్ లీడ‌ర్ త‌ర‌హాలో ఈ చిత్రం ఉండ బోతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న బోయ‌పాటి-రామ్ చ‌ర‌ణ్ సినిమా విడుద‌ల కానుంది.  

More Related Stories