English   

షాకింగ్ : రాజమౌళి తప్పుకున్నాడు...బోయపాటి ఒప్పుకున్నాడు !

Boyapati Srinu settled in Amaravati!
2019-03-15 20:31:38

రాజమౌళి సినిమాల విషయంలో ఎక్కడా వెనకి తగ్గే మనిషి కాదు. తనకు కావాల్సింది వచ్చే దాకా ఎంత పెద్ద హీరో అయినా ఎన్ని టేక్ లు అయినా తీసి తీరాల్సిందే. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సెట్స్విషయంలో ఆయన విజన్ ని పనితనాన్ని మెచ్చుకొని వారు ఉండరు. అందుకే సాక్షాత్తు చంద్రబాబు సైతం అమరావతి నిర్మాణంలో, అక్కడ కట్టబోయే భవంతుల విషయంలో రాజామౌళి సలహాలు సూచనలు తీసుకున్నాడు. అయితే తాజాగా జరగనున్న 2019 ఎన్నికల విషయంలో కూడా చంద్రబాబు రాజమౌళి సహాయం తీసుకోవాలని అనుకుని రాజమౌళిని సంప్రదించాడట. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను యాడ్స్ రూపంలో తెరకెక్కించమని రాజమౌళిని అడగగా ఆయన ప్రస్తుత బిజీ షెడ్యూల్ వలన చేయలేనని సున్నితంగా తిరస్కరించాడట. దీంతో ఆ బాధ్యతని బాబు మరో టాలెంటెడ్ డైరెక్టర్ ఇంతకు ముందు బాబు కోసం పుష్కరాల విషయంలో కొన్ని వీడియోస్ తీసిచ్చిన బోయపాటికి ఇద్దామని ట్రై చేయగా ఆయన వెంటనే ఒప్పేసుకున్నాడు. వినయ విధేయ రామ భారీ డిజాస్టర్ తో ఉన్న బోయపాటి ప్రస్తుతం టీడీపీ యాడ్స్ మేకింగ్ లో బిజీ అయ్యాడని అమరావతి వర్గాల సమాచారం. రెండ్రోజుల నుండీ అమరావతిలోనే తిష్ట వేసిన బోయపాటి ఆ పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడని సమాచారం.

More Related Stories