English   

బన్నీతో బోయ‌పాటి మ‌రో సినిమా

Boyapati Srinu
2021-05-11 14:45:27

బోయ‌పాటి అల్లు అర్జున్ కాంబోలో వ‌చ్చిన స‌రైనోడు సినిమా ఎటాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. అయితే వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఇప్పుడు మరో సినిమా రాబోతుంద‌ట‌. బోయ‌పాటి ఇప్ప‌టికే గీత ఆర్ట్స్ బ్యాన‌ర్ నుండి అడ్వాన్స్ భారీ మొత్తాన్ని తీసుకున్నార‌ట‌. దాంతో అల్లు అర్జున్ తో మ‌రో సినిమా చేసే అవ‌కాశం ఉందంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా బోయ‌పాటి అల్లు అర్జున్ ను ఈ మ‌ధ్య కాలంలో రెండు మూడు సార్లు మీట్ అయ్యార‌ట‌. కాగా స్క్రిప్ట్ ప‌ట్టుకు రావాల‌ని బ‌న్నీ కోర‌గా ఇప్పుడు అదే ప‌నిలో బోయ‌పాటి ఉన్న‌ట్టు తెలుస్తుంది. 

ఇదిలా ఉండ‌గా బ‌న్నీ ప్ర‌స్తుతం పుష్ప సినిమాలో న‌టిస్తున్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల‌కు ఎన్నో అంచనాలున్నాయి. అంతే కాకుండా ఈ సినిమా టీజ‌ర్ కు కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తొంది. అయితే ఈ సినిమా త‌ర‌వాత బ‌న్నీ కొర‌టాల కాంబినేష‌న్ అనుకున్నారు కానీ ఆ సినిమా ఆగిపోయింది. అంతే కాకుండా వేణు శ్రీరామ్ తో సినిమా ఉంటుంద‌ని భావించారు. కానీ బ‌న్నీ ఇప్ప‌టివ‌ర‌కు వేణుకు ఎస్ చెప్ప‌లేదు. 

ఇక ఇప్పుడు బోయ‌పాటి పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇక బోయ‌పాటి శ్రీను ప్ర‌స్తుతం బాల‌య్య హీరోగా అఖండ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌లైన టీజ‌ర్ టికార్డులు క్రియేట్ చేస్తోంది. యంగ్ హీరోల టీజ‌ర్ల‌ను సైతం బీట్ చేస్తూ అఖండ దూసుకెలుతోంది. దాంతో సినిమాపై కూడా ఎన్నో అంచనాలున్నాయి.

More Related Stories