English   

ఇక డైరెక్ట్ వార్ అంటున్న పోసాని శిష్యులు

siva
2020-03-26 07:37:08

టాలీవుడ్ అంతా ఇప్పుడు సైలెంట్ అయిపొయింది. కరోనా పుణ్యమా అని నిత్యం లేస్తే లైట్స్ యాక్షన్ అనే సౌండ్స్ వినే సినిమా జీవి ఇప్పుడు ఇళ్లకే పరిమితం అయ్యాడు. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదేంటంటే ఇప్పటిదాకా పుకార్లకే పరిమితం అయిన ఒక విషయాన్ని ఇద్దరు అగ్ర దర్శకులు నిజం చేయబోతున్నారట. వారిద్దరూ ఎవరో కాదు కొరటాల శివ, అలాగే బోయపాటి శీను. ఇద్దరూ పోసాని శిష్యులే. ఈ ఇద్దరోలో ఇండస్ట్రీకి ముందుగా పరిచయమైన బోయపాటి మొదటి సినిమా భద్ర మొదలు వరుస హిట్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. వినయ విధేయ రామ చిత్రం పరాజయంతో ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్ ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు ఆయన బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నాడు. మరోవైపు 'మిర్చి' లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో డైరెక్టర్ గా మారిన కొరటాల ఆ సినిమా మోదారు అసలు ఫ్లాప్ అనేది లేకుండా ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ ఇరిద్దరికి పడదనే పుకారు ఎప్పటి నుండో ఉంది. ఇప్పుడు ఆ టాక్ ని నిజం చేస్తూ వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద తలపడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ రెండు సినిమాలు ఒకే తేదీన విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. గతంలో కూడా చిరు బాలయ్యలు బాక్సాఫీస్ వద్ద చాలాసార్లు పోటీపడినా ఇప్పుడు ఈ దర్శకుల పోరు ఎలా మారనుందో తెలియాలి మరి.

 

More Related Stories