English   

మోస్ట్ అప్రిసియేటెడ్ సినిమా రిలీజ్ కు రెడీ

C/o-Kancharapalem
2018-08-09 18:19:24

పెళ్లి చూపులు సినిమా మనలో చాలామంది చూసి ఉంటాం కదా.. కానీ ఈ సినిమా రిలీజ్ కు ముందే ప్రివ్యూస్ లో ఫిఫ్టీ డేస్ ఆడిందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ సినిమాను రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లోనే చూశారు. కూడా దాదాపు రెండు నెలల పాటు. ఇక ఆ తర్వాత కొన్ని డిఫరెంట్ మూవీస్ అన్నీ అలా ల్యాబ్స్ లో సూపర్ హిట్ అయ్యాకే ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. లేటెస్ట్ గా ఇలా ఆల్రెడీ రెండు నెలలుగా ప్రివ్యూస్ తోనే ఆకట్టుకుంటోన్న సినిమా ‘‘కేరాఫ్ కంచరపాలెం’’. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది ఈ సినిమాను చూశారు. ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో కూడా తెగ రాసేశారు. నిజానికి ఈ సినిమా ఈ మధ్య కాలంలో మోస్ట్ అవెయిటెడ్ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఆ స్థాయిలో ఆల్రెడీ చూసిన వారి నుంచి అప్రిసియేషన్ వస్తోంది. 

ముఖ్యంగా దర్శకుడు వెంకట్ మహాకు ఇప్పటికే చాలామంది ప్రొడ్యూసర్స్  అడ్వాన్స్ లు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతటి అప్రిసియేషన్ పొందిన ఈ సినిమా ఫైనల్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇప్పటి వరకూ ఇలాంటి డేట్స్ చాలా చెప్పారు. కానీ  ఇదే ఫైనల్ అంటున్నారు. కారణం లేటెస్ట్ గా కేరాఫ్ కంచర పాలెం సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుంచి ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి కేరాఫ్ కంచరపాలెం సెప్టెంబర్ 7న విడుదల కాబోతోంది. ఇది పూర్తిగా అఫీషియల్ అని చెప్పలేం కానీ.. ఆ రిలీజ్ డేట్ ను త్వరలోనే దగ్గుబాటి రానా అనౌన్స్ చేస్తాడట. అన్నట్టు ఈ సినిమాను సురేష్ బాబు విడుదల చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా టాక్ ను బట్టి హిట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం కొత్తవాళ్లే చేసిన ఆ హానెస్ట్ ఎక్స్ పర్మెంట్ కు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

More Related Stories