English   

బ‌న్నీని భ‌య‌పెడుతున్న ఓవ‌ర్సీస్..

allu-arjun
2018-05-01 06:56:01

ఒక‌ప్పుడు ఓవ‌ర్సీస్ మార్కెట్ ఎక్కువ‌గా ఉన్న హీరోల్లో అల్లుఅర్జున్ ముందు వ‌ర‌స‌లో ఉండేవాడు. మ‌హేశ్ త‌ర్వాత ఈయ‌న సినిమాల‌కే ఎక్కువ‌గా క్రేజ్ ఉండేది. కొత్త క‌థ‌లు చేస్తున్నాడ‌నో.. లేదంటే కామెడీ ఉంటుంద‌నో.. డాన్సులు బాగా చేస్తాడ‌నో.. ఎందుకో కానీ ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్ బాగా క‌నెక్ట‌య్యారు. కానీ గ‌త కొన్నేళ్లుగా బ‌న్నీకి ఓవ‌ర్సీస్ ఇమేజ్ దిగ‌జారుతూ వ‌స్తుంది. దానికి ఆయ‌న ఎంచుకుంటున్న క‌థ‌లే కార‌ణం. స‌రైనోడు సినిమా ఇండియాలో బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది కానీ ఓవ‌ర్సీస్ మాత్రం డిజాస్ట‌ర్. అక్కడ ఈ చిత్రాన్ని కొన్న బ‌య్య‌ర్ నిండా మునిగిపోయాడు. క‌నీసం 1 మిలియ‌న్ కూడా దాట‌లేక చేతులెత్తేసాడు స‌రైనోడు. ఇక డిజే కూడా అంతే. హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇక్కడ ప‌ర్లేద‌నిపించింది.. కానీ ఓవ‌ర్సీస్ లో మాత్రం ఫ్లాప్. దానికి కార‌ణం కూడా ఒక్క‌టే.. రొటీన్ స్టోరీ. దాంతో ఇప్పుడు కొత్త‌గా ఉంటుంద‌ని నా పేరు సూర్య ట్రై చేసాడు బ‌న్నీ. ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్ కు కొత్త‌గా ఏం చేసినా న‌చ్చుతుంది. ఇదే ఇప్పుడు బ‌న్నీలో ధైర్యం నింపుతుంది. ఈ చిత్రంతో క‌చ్చితంగా 2 మిలియ‌న్ సినిమా అందుకోవాల‌ని చూస్తున్నాడు బ‌న్నీ. నా పేరు సూర్య రేట్ కూడా 7 కోట్లే ప‌లికింది. అంటే 2 మిలియ‌న్ సాధిస్తే సినిమా సేఫ్ అయి హిట్ అనిపించుకుంటుంది. ఇప్ప‌టి వ‌రకు 1.5 మిలియ‌న్ సినిమా కూడా బ‌న్నీకి లేదు. అయితే ఇంత‌కంటే దారుణ‌మైన రికార్డ్ ఉన్న చ‌ర‌ణ్.. రంగ‌స్థ‌లంతో ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేసాడు. దాంతో సినిమా బాగుంటే అక్క‌డి ప్రేక్ష‌కులు అవేవీ ప‌ట్టించుకోర‌ని అర్థ‌మైంది. మ‌రి చూడాలిక‌.. బ‌న్నీ నా పేరు సూర్య‌తో ఓవ‌ర్సీస్ లో ఎలాంటి రికార్డుల‌కు తెర‌తీస్తాడో..?

More Related Stories