English   

త్రివిక్రమ్ తో అరవింద సమేతకు సమస్యలా..?

NTR-Trivikram
2018-08-06 15:19:30

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మోస్ట్ క్రేజీయొస్ట్ ప్రాజెక్ట్ ‘అరవింద సమేత వీరరాఘవ’. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఫస్ట్ టైమ్ రూపొందుతోన్న సినిమా ఇది. ఇక ఎన్టీఆర్ కు  హారిక హాసిని బ్యానర్ లో సినిమా చేయడం కూడా ఇదే మొదటిసారి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాతో హీరో సునిల్ మళ్లీ కమెడియన్ గా యూ టర్న్ తీసుకుంటున్నాడు. మొత్తంగా దసరా బరిలో విడుదలకు సిద్ధమైన ఈ మూవీకి ఇప్పుడు డెడ్ లైన్స్ పెరిగాయి. దీంతో చెప్పిన టైమ్ కు విడుదలవుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 

అరవింద సమేత వీరరాఘవకు రిలీజ్ డేట్ ను అక్టోబర్ 11గా ఫిక్స్ చేశారు. అయితే ఆ తర్వాతి వారమే దసరా పండగ ఉంది. అంటే ఈ వారంతో పాటు దసరా శెలవులు మరో వారం వరకూ ఈ మూవీ క్యాష్ చేసుకునే చాన్స్ ఉంది. అయితే ఇప్పుడా చాన్స్ కు గండి పడుతుందా అనే డౌట్స్ పెరిగాయట. అందుకు కారణం త్రివిక్రమ్ అంటున్నారు. ప్రొడక్షన్ పరంగా చాలా టైమ్ తీసుకుంటాడు త్రివిక్రమ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అది ఇప్పుడు కూడా రిపీట్ అవుతోంది. దీంతో సినిమా అనుకున్న టైమ్ కు పూర్తి కాకపోవచ్చు అంటున్నారు. ఇప్పటికే ఆగస్ట్ ఫస్ట్ వీక్ కూడా పూర్తి కావొచ్చింది. కానీ ఇంకా చాలా షూటింగ్ బ్యాలన్స్ ఉందంటున్నారు. ఈ కారణంగా సెప్టెంబర్ వరకూ సినిమా అవుతుందా అనే టెన్షన్ ప్రొడక్షన్ హౌస్ లో స్టార్ట్ అయిందంటున్నారు. అలా జరగకపోతే సమస్యలు తప్పవు. అందుకే హారిక హాసిని బ్యానర్ నుంచి త్రివిక్రమ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా వెళ్లినట్టు టాక్. 

ఇక తన ఓన్ బ్యానర్ అనుకునే ప్రొడక్షన్ హౌస్ నుంచే వార్నింగ్ లాంటిది రావడంతో త్రివిక్రమ్ ముందు ఫీలైనా తర్వాత అలెర్ట్ అయ్యాడట. అందుకే స్పీడ్ పెంచినట్టు టాక్. ఇప్పటికి వినిపిస్తోన్న దాన్ని బట్టి ఈ సినిమాకు ఇంకా 45-50 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉందంటున్నారు. అది నిజమైతే ఖచ్చితంగా చెప్పిన టైమ్ కు రాలేదు. షూటింగ్ పరంగా పూర్తయినా.. అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ఇంకా ప్రమోషన్స కు పెద్దగా టైమ్ ఉండదు. అంటే హడావిడీగా సినిమా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే సినిమాకు భారీగా బిజినెస్ జరిగే అవకాశాలున్నాయి. అందువల్ల చుట్టేస్తే కుదరదు. మొత్తంగా త్రివిక్రమ్ ఇప్పుడు షూటింగ్ తో పాటు ఏకకాలంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాడట. అంటే రిలీజ్ టైమ్ కు ఎక్కువ హడావిడీ కాకుండా చూసుకుంటున్నారని టాక్. మొత్తంగా అజ్ఞాతవాసి తర్వాత చేస్తోన్న సినిమా కాబట్టి ఖచ్చితంగా త్రివిక్రమ్ ఈ సినిమాను ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ చేయాల్సిందే.

More Related Stories