English   

వ‌ర్మ‌ను ఎవ‌రూ ఏం చేయ‌లేరా..?

RGV-Tollywood

అదేంటి ఇంత చేస్తున్నాడు వ‌ర్మ‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేక‌పోవ‌డం ఏంటి..? అస‌లు ఇప్పుడు ఈయ‌న‌పై మా అసోషియేష‌న్ లో పెద్ద ర‌చ్చే జ‌రుగు తుంది క‌దా..? వ‌ర్మ‌తో సినిమాలు చేయ‌కూడ‌దని.. ఆయ‌న్ని ఇండ‌స్ట్రీ నుంచి బ‌య‌టికి తోలేయాలంటూ పెద్ద చ‌ర్చ‌లే జ‌రుగుతున్నాయి క‌దా..? ఇప్పుడు వ‌ర్మ‌ను ఎవ‌రూ ఏం చేయ‌క‌పోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉన్నా ఇదే నిజం. ఇప్పుడు ఇక్క‌డ తెలుగు ఇండ‌స్ట్రీలో వ‌ర్మ‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు.. ఇంకాస్త ప‌చ్చిగా చెప్పాలంటే ఎవ‌రూ ఏమీ పీక‌లేరేమో..? దానికి ఓ కార‌ణం కూడా లేక‌పోలేదు. లాజికల్ గా మాట్లాడుకుంటే వ‌ర్మ అనేవాడు తెలుగు ద‌ర్శ‌కుడు కాదు. ఆయ‌న మెంబ‌ర్ షిప్ కూడా ఇక్క‌డ లేదు. మా అసోషియేష‌న్ మెంబ‌ర్ కాదు. ఆయ‌న ముంబై ఇండ‌స్ట్రీ నుంచి వ‌చ్చిన‌వాడు. అక్కడే అన్నీ వ‌ర్మ‌కు ఉన్నాయి. దావూద్ ఇబ్ర‌హీం అక్క‌డెక్క‌డో దుబాయ్ లో ఉండి అన్నీ ఇక్క‌డ న‌డిపిన‌ట్లే.. అన్నీ ముంబైలో పెట్టుకుని హైద‌రాబాద్ లో అప్పుడ‌ప్పుడూ ఇలా బాద‌డానికి వ‌స్తుంటాడు వ‌ర్మ‌. దాంతో ఇప్ప‌టికిప్పుడు ఆయ‌నపై నిర్ణ‌యాలు తీసుకోడానికి వ‌ర్మ ఇక్క‌డి ద‌ర్శ‌కుడు కాదు. దాంతో ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు ఆయ‌న్ని. పైగా అన్నీ లాజిక్ గా మాట్లాడుతూ చాలా తెలివిగా త‌ప్పించుకుంటున్నాడు వ‌ర్మ‌. తెలుగు ఇండ‌స్ట్రీ నాది కాదంటూనే అన్నీ నాకే కావాలంటున్నాడు వ‌ర్మ‌. ఈయ‌న చేస్తోన్న ప‌నుల‌కు మ‌ళ్లీ సారీ కూడా చెబుతున్నాడు. ఇక‌పై ఎప్పుడూ మెగా ఫ్యామిలీని ప‌ట్టించుకోన‌ని ప్ర‌తీసారి ప్రామిస్ చేసి బ్రేక్ చేస్తూనే ఉంటాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రి ఈ సారి ఏం చేస్తాడో..? వ‌ర్మ చేస్తోన్న ఈ ప‌నుల‌కు ఇండ‌స్ట్రీ ఎలాంటి రియాక్ష‌న్ ఇస్తుందో చూడాలిక‌..!.

More Related Stories