English   

జ్యోతిక మీద కేసు...రాక్షసి ఎఫెక్ట్ !

actress1
2019-07-18 07:44:15

తమిళ స్టార్ హీరో భార్య, ఒకప్పటి హీరోయిన్ ఇప్పటి నటి జ్యోతిక మీద పోలీస్ కేస్ నమోదయ్యింది. ఎందుకో తెలుసా ? సినిమాలో నటించినందుకు. అదేంటీ సినిమాలో నటించినా కేసులు పెడతారా ? అనుకోకండి. నిజమే జ్యోతిక తన తాజా సినిమాలో చేసిన క్యారెక్టర్ తమ మనోభావాలను దెబ్బ తీసిందని ఉపాధ్యాయులు చెన్నై పోలీసులకి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా రాక్షసి. ఈ సినిమాలో తిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా నటించింది. ఈ చిత్రంలో ఉపాధ్యాయులు పిల్లలకు సరిగా పాఠాలు బోధించకుండా నవలలు చదుకుంటున్నట్లు, సెల్‌ఫోన్లతో కాలం గడపడం వంటి సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అంతే కాకుండా విద్యార్థులు సిగరెట్లు తాగడం, మందు కొట్టడం గొడవలు పడడం లాంటి సన్నివేశాలను చూపారు. ప్రభుత్వ పాఠశాలల టీచర్లు అధిక వేతనాలు తీసుకుంటున్నారని, అయినా విద్యార్థులపై సరిగా దృష్టి పెట్టకపోవడం వల్లే వారు వైద్య విద్య లాంటి ఉన్నత చదువులు చదవలేకపోతున్నారనే సందేశం ఇచ్చేలా ఆ సినిమాలో కొన్ని సీన్లు ఉన్నాయి. దీంతో రాక్షసిలోని ఇలాంటి సీన్లు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను కించపరచేవిగా ఉన్నాయనే కారణంగా తమిళనాడు ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీకే.ఇళమారన్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ ఆఫీస్ లో రాక్షసి సినిమా మీదా, జ్యోతిక మీదా ఫిర్యాదు చేశారు. 

More Related Stories