English   

క‌న్ను గొట్టిన అమ్మాయిపై పోలీస్ కేస్.. 

Priya-Varrier

ప్రియా వారియ‌ర్.. రెండు మూడు రోజులుగా సోష‌ల్ మీడియాను త‌న ఎక్స్ ప్రెష‌న్స్ తో చంపేస్తున్న బ్యూటీ. క‌న్నుగొట్టి కుర్రాళ్లంద‌ర్నీ ప‌డేసింది ఈ ముద్దుగుమ్మ‌. మూడు రోజులుగా నెట్ వ‌ర్కింగ్ సైట్ లో దేశంలోనే రెండో స్థానంలో ఉంది ఈ పాట‌. ఒరు అడార్ ల‌వ్ సినిమాలోని మాణిక మ‌ల‌రావి అంటూ సాగే ఈ పాట‌లో ప్రియా వారియ‌ర్ త‌న ముద్దు ముద్దు ఎక్స్ ప్రెష‌న్స్ తో ప‌డేసింది. అందులోనే 30 సెక‌న్ల పాటు త‌న చూపుల‌తో అంద‌ర్నీ మాయ చేసింది. క‌న్ను గొట్టి కుర్రాళ్ల‌కు నిద్ర‌ను దూరం చేసింది. ఇప్పుడు ఇలా క‌న్ను గొట్టినందుకు కొంద‌రు ముస్లిమ్స్ మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయి. ప్రేమ‌లో ఉన్న‌పుడు క‌న్ను గొట్టుకోకుండా ఎలా ఉంటారు అనుకుంటున్నారా..?

అయితే ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది. ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా నటించిందంటూ.. ప్రియాపై కేస్ పెట్ట‌డానికి అస‌లు కార‌ణం ఇచ్చిన ఎక్స్ ప్రెష‌నో.. లేదంటే క‌న్ను గొట్ట‌డ‌మో కాదు. అస‌లు స‌మ‌స్య వ‌చ్చింది ఆ పాటతో. అవును వాళ్లు వాడుకున్న పాడుకున్న పాట‌తోనే అస‌లు ఇబ్బంది వ‌చ్చింది. మాణిక్య మలరావి పూవి అనే పాట‌ను మలబార్ ప్రాంతంలోని ముస్లింలు తమ పండుగలలో వాడుకుంటుంటారు. అలాంటి ప‌విత్ర‌మైన పాట‌ను తీసుకొచ్చి ఇక్క‌డ క‌న్ను గొట్ట‌డానికి వాడుకుంటారా అంటూ పోలీస్ కేస్ పెట్టారు. ముస్లింల దైవం మహమ్మద్ ప్రవక్త.. అతని భార్య ఖదీజా.. పాడుకున్న పాట అని వారి నమ్మకం. వారి ప్రేమకు చిహ్నంగా ఈ పాటను పరిగణిస్తారు. ఇప్పుడా పాటను ఈ కుర్రాళ్ల ప్రేమకథకు వాడేసుకోవడం కొంతమందికి నచ్చడం లేదు. అందుకే ఈ కేసు నమోదయినట్లుగా తెలుస్తోంది. ఇక్క‌డ మ‌రో విశేషం ఏంటంటే ఎక్క‌డో కేర‌ళ‌లో మొద‌లైన ఈ పాట‌పై హైద‌రాబాద్ లోనే కేస్ న‌మోదైంది. మ‌రి ఈ వివాదం ఎంత‌దూరం వెళ్తుందో చూడాలిక‌..!

More Related Stories