English   

తండ్రి మిస్సైనా.. త‌న‌యుడితో చిందులు.. 

Catherine-charan

మెగా ఫ్యామిలీలో ఏ ఒక్క హీరోతో న‌టించే ఛాన్స్ మిస్ అయింద‌ని ఏ ఒక్క హీరోయిన్ కూడా బాధ ప‌డ‌దు. ఎందుకంటే ఆ కుటుంబంలో క్రికెట్ టీంకి స‌రిపోయేంత మంది హీరోలున్నారు. ఒక్క‌రు మిస్ అయినా మ‌రొక‌రితో న‌టించే అవ‌కాశం వ‌స్తుంది కాబ‌ట్టి. ఇప్పుడు కేథ‌రిన్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. అప్ప‌ట్లో చిరంజీవితో న‌టించే ఛాన్స్ మిస్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. అన్నీ కుదిరుంటే ర‌త్తాలు ర‌త్తాలు అంటూ ఇప్పుడు కేథరిన్ థ్రెసానే పిలిచేవాళ్లం. కానీ అప్పుడు అనుకోకుండా ఆ అవ‌కాశం మిస్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. కానీ దానికంటే ముందే బ‌న్నీతో స‌రైనోడు.. రుద్ర‌మ‌దేవి.. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో లాంటి సినిమాలు చేసింది ఈ భామ‌. స‌రైనోడుతో బోయ‌పాటికి కూడా బాగానే క‌నెక్ట్ అయిపోయింది ఈ అందాల ఎమ్మెల్యే. దాంతో జ‌య జాన‌కి నాయ‌కాలో కూడా ఐటం సాంగ్ చేయించాడు. ఇక ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ సినిమాలోనూ కేథ‌రిన్ నే తీసుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇందులో చిన్న పాత్ర‌తో పాటు స్పెష‌ల్ సాంగ్ కూడా డిజైన్ చేసాడు మాస్ డైరెక్ట‌ర్. కేథ‌రిన్ ఉంటే చాలు అనుకుంటున్నాడేమో కానీ కోరిమ‌రి ఈ ఎమ్మెల్యేనే తీసుకొస్తున్నాడు బోయ‌పాటి శీను. ప్ర‌స్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు చిత్ర‌యూనిట్. మే 12 నుంచి బ్యాంకాక్ లో రెండు వారాల షెడ్యూల్ చేసుకుని రానున్నారు. ఆ త‌ర్వాత కేథ‌రిన్ పై సాంగ్ షూట్ ఉంటుంది. మొత్తానికి అప్పుడు తండ్రితో చిందేసే ఛాన్స్ మిస్ అయినా కూడా ఇప్పుడు త‌న‌యుడితో స్టెప్పులు వేయ‌బోతుంది కేథ‌రిన్ థ్రెసా. 

More Related Stories