English   

రియా చక్రవర్తి పై సిబిఐ కేసు నమోదు

Rhea Chakraborty
2020-08-07 09:06:29

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ఇప్పుడు రియా చక్రవర్తి చుట్టూ తిరుగుతోంది. సోషల్ మీడియా అయితే ఆమె సుశాంత్ ని హత్య చేసిందన్నట్టు హైలైట్ చేస్తోంది. ఇదిలా జరుగుతుండగానే ఆమె దాదపుగా మూడు నెలల్లో సుశాంత్ అకౌంట్ నుంచి 3 కోట్ల వరకు రియా ఖర్చు చేసిందని విషయం బయటికి వచ్చింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బీహార్ పోలీసులు రియా చక్రవర్తి సహా మరో ఐదుగురు కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసారు. అయితే అక్కడి పోలీసులు ముంబై వెళ్లి తమ విచారణ మొదలు పెట్టినా లోక ముంబై పోలీసుల నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. అయితే ఈయన మరణం విషయంలో మొదటి నుండి అందరూ డిమాండ్ చేస్తున్నట్టుగానే నటుడు సుశాంత్ మరణం పై సిబిఐ కేసు నమోదు చేసింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి పైన సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రియా చక్రవర్తి ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి తల్లి సంధ్య చక్రవర్తి సోదరుడు శోవిక్ చక్రవర్తి , శామ్యూల్,  శృతి మోడీలపై సి.బి.ఐ కేసు నమోదు చేసింది. బీహార్ ప్రభుత్వం ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. మొత్తం ఎనిమిది సెక్షన్ల కింద సిబిఐ కేసు నమోదు చేసింది. 120, బి 306 , 341, 342, ,306, 420, ,506 కింద కేసు నమోదు చేసిన సీబీఐ 20 పేజీలతో ఎఫ్ఐఆర్ సిద్దం చేసింది.  
 

More Related Stories