English   

డ్రగ్స్ కేసులో వివేక్ ఒబేరాయ్ బావమరిది పేరు..

Aditya Alvas
2020-09-18 08:43:18

తీగ లాగితే డొంక కదిలినట్లు శాండిల్ వుడ్ లో డ్రగ్స్ కేసు ఎక్కడెక్కడో ఎన్నో మలుపులు తిరుగుతుంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత ఆ కేసు అనేక మలుపులు తిరిగి ఇప్పుడు డ్రగ్స్ కుంభకోణం దగ్గర ఆగింది. ఇందులో చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే రియా చక్రవర్తి విచారణలో మరికొందరు హీరో హీరోయిన్ల పేర్లు కూడా బయటికి వచ్చాయి. బాలీవుడ్లో 25 మంది లిస్ట్ కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు అందులో మరో పేరు కూడా బయటకు వచ్చింది. బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ బావ మరిది ఆదిత్య అల్వ పేరు ఇందులో ఉండటం గమనార్హం. ఈయన కేవలం వివేక్ ఓబెరాయ్ బావమరిది మాత్రమే కాదు.. మాజీ మంత్రి జీవరాజ్ అల్వ తనయుడు కూడా. ఆదిత్య తో పాటు బెంగళూరు డ్రగ్ కేసులో మరో 15 మంది కూడా కీలకంగా వున్నట్టు సీసీబీ అధికారుల నుంచి వచ్చిన సమాచారం. 

రైడ్స్ విషయం తెలిసి ఆదిత్య అల్వ అజ్ఞాతంలోకి వెళ్లడం మరింత సంచలనంగా మారింది. ఆదిత్య అల్వ రిసార్ట్ లో పలువురు కన్నడ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ వీకెండ్ పార్టీలకు హాజరయ్యే వాళ్లని.. అందులో డ్రగ్స్ వినియోగం కూడా భారీగా ఉండేదని తెలుస్తుంది. ఆదిత్య అల్వా హై ప్రొఫైల్ వున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కావడం.. అతని తండ్రి మాజీ పవర్ఫుల్ మినిస్టర్ కావడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారిన అవకాశం ఉంది. అందరి దృష్టి ప్రస్తుతం ఈ డ్రగ్స్ కేసు పైనే ఉంది. ఆదిత్య తల్లి నంది అల్వ కూడా పేరున్న ఈవెంట్ ఆర్గనైజర్. మంచి డ్యాన్సర్ కూడా కావడం గమనార్హం. దీంతో ఈ కేసులో మరిన్ని పెద్ద తలలు ఉండే అవకాశం ఉందని కన్నడనాట పుకార్లు వినిపిస్తున్నాయి. మరి చూడాలిక రాబోయే రోజుల్లో ఇంకా ఈ డ్రగ్స్ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో. 

More Related Stories