English   

నానిని చూసి భ‌య‌ప‌డుతున్న హీరోలు.. 

Nani
2018-07-26 21:08:06

అవును.. ఇప్పుడు నానిని చూసి బిగ్ బాస్ లో ఉన్నోళ్లే కాదు.. బ‌య‌టి హీరోలు కూడా భ‌య‌ప‌డుతున్నారు. అంతగా ఆయ‌న భ‌య‌పెడుతున్నాడు. దీనికి కార‌ణం కూడా లేక‌పోలేదు. బిగ్ బాస్ తొలి సీజ‌న్ లో ఎన్టీఆర్ తో పాటు షో కూడా సూప‌ర్ హిట్ అయింది. రేటింగ్స్ లోనూ దుమ్ము దులిపేసింది ఈ కార్య‌క్ర‌మం. అయితే ఇప్పుడు నాని బిగ్ బాస్ 2 మాత్రం ఊహించ‌ని స‌క్సెస్ కాక‌పోవ‌డ‌మే కాదు.. బోన‌స్ గా భ‌య‌పెడుతుంది కూడా. ప్ర‌మోషన్ కోసం ఈ షోకు రావాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు స్టార్స్. దానికి కార‌ణం ఈ సారి షోకు వ‌చ్చి ప్ర‌మోట్ చేసుకున్న ఒక్క సినిమా కూడా స‌క్సెస్ కాక‌పోవ‌డ‌మే. జంబ ల‌కిడి పంబ‌తో పాటు మ‌రికొన్ని సినిమాల‌ను కూడా ఈ షోలో వ‌చ్చి ప్ర‌మోట్ చేసుకున్నారు. 

మొన్న‌టికి మొన్న మంచు ల‌క్ష్మి వైఫ్ ఆఫ్ రామ్ కూడా ఈ షోకు వ‌చ్చింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సినిమా కూడా ఈ షో నుంచి హిట్ అయింది లేదు. కానీ తొలి సీజ‌న్ లో మాత్రం అప్పుడు వ‌చ్చిన ప్ర‌తీ సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అప్ప‌ట్లో రానా నేనేరాజు నేనేమంత్రితో పాటు మ‌రిన్ని సినిమాలు కూడా ఎన్టీఆర్ తో పాటు వ‌చ్చి ప్ర‌మోట్ చేసుకున్నాడు. అంతెందుకు ఆయ‌నే న‌టించిన జై ల‌వ‌కుశను కూడా బిగ్ బాస్ లో వాడుకున్నాడు ఎన్టీఆర్. క‌ళ్యాణ్ రామ్ తో పాటు అంతా బిగ్ బాస్ తొలి సీజ‌న్ ను వాడుకున్నారు. కానీ రెండో సీజ‌న్ కు అంత క్రేజ్ రావ‌ట్లేదు. ప్ర‌మోషన్ లో కూడా ఏ సినిమాకు పెద్ద‌గా క‌లిసిరాక‌పోవ‌డంతో ఈ షోకు రావ‌డానికి కూడా ఆలోచిస్తున్నారు స్టార్స్. దాంతో బిగ్ బాస్ 2 అటు రేటింగ్స్ ప‌రంగా.. ఇటు ప్ర‌మోష‌న్ ప‌రంగా అన్నింట్లోనూ ఫ్లాప్ గా నిలిచిపోయింది ఈ షో.

More Related Stories