English   

ఆచార్య విరాటపర్వం సినిమాలకు బిగ్ షాక్

Acharya and Virataparvam
2021-04-10 14:43:54

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య...రానా హీరోగా నటించిన విరాటపర్వం సినిమాలకు బిగ్ షాక్ తగిలింది. ఈ రెండు సినిమా లకు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వొద్దని హైదరాబాద్ ఆధారిత సంస్థ యాంటీ టెర్రరిజం ఫోరమ్ సెన్సార్ బోర్డుకు తెలిపింది. ఇటీవల ఛత్తీస్ గడ్ లో జరిగిన 22 మంది సీఆర్పిఎఫ్ జవాన్ల ఊచకోత దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దాంతో జవాన్ల మరణాలను పౌరులుగా ఖoడిస్తుండగా...మావోయిస్టులను హీరోలుగా చూపించే సినిమాలకు క్లియరెన్స్ ఇవ్వవద్దని యాంటీ టెర్రరిజం ఫోరమ్ డిమాండ్ చేస్తుంది. నక్సలైట్ లను హీరోలుగా చూపించే సినిమాలకు చెక్ పెట్టాలని సూచించింది. 

అయితే గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు అందాయి. కానీ ఒక సంస్థ దీనికి ప్రాతినిధ్యం వహించడం ఇదే మొదటి సారి. దాంతో ఆచార్య మరియు విరాటపర్వం లపై సెన్సార్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అన్న ఆసక్తి మొదలయింది. ఇక మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. మరో వైపు రానా నటిస్తున్న విరాటపర్వం సినిమాకు వేణు కుడుముల దర్శకత్వం వహించగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

More Related Stories