English   

ఓటీటీ కట్టడికి సిద్ధమైన కేంద్రం...5 విభాగాలుగా కంటెంట్ విభజన

Ott Platforms
2021-02-25 15:39:52

ఓటీటీ కంటెంట్ పై ఆంక్షలు తీసుకువస్తామని కేంద్రం ఎప్పటినుండో చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ కట్టడికి కేంద్రం సిద్ధమయ్యింది. తాజాగా కేంద్ర ఐటీ, టెలికాం  శాఖ మంత్రి  రవిశంకర్ ప్రసాద్ దానికి సంబంధించిన సంకేతాలను ఇచ్చారు. ఓటిటి, సోషల్ మీడియాకు నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురానుంది. దానికోసం మూడు అంచెల నియంత్రణ విధానం అమలులోకి తీసుకువస్తుంది. ఓటిటి లో ఐదు అంశాలను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంటుంది. అసభ్య, అశ్లీల, హింసాత్మక  కంటెంట్ పై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. వయస్సు ఆధారంగా 5 విభాగాలుగా ఓటీటీ విభజన చేయాలని నిర్ణయం తీసుకుంది. సామాజిక ఉద్రిక్తతలు పెంచే కంటెంట్ పై నిషేధం విధించాలని నిర్ణయించింది.  

సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే అంశాల పై నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తుంది. మహిళలు, చిన్నారులు, దళితులను అవమానించే కంటెంట్స్ పై నిషేధాజ్ఞలు విదిస్తుంది. జాతీయ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసే కంటెంట్ పై ప్రస్తుతం  నిషేధం కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం పై నియంత్రణ విధించనుంది. అసత్య ప్రచారం ప్రారంభం చేసే తొలి వ్యక్తి వివరాలు ఖచ్చితంగా వెల్లడించేలా చర్యలు తీసుకుంటోంది. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే అసత్య ప్రచారం కంటెంట్ తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదులను పరిష్కరించే అధికారులు దేశం లోనే ఉండాలని కేంద్రం నిర్ణయించింది. ఫిర్యాదులను పరిష్కరించే అధికారులు 24 గంటలూ దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉండాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్రం కొత్త విధానాలతో ఓటిటి లకు కళ్లెం పడనుంది. 

More Related Stories