English   

బస్తి బాలరాజు ఊర మాస్.. చావు కబురు చల్లగా ఫస్ట్ టీజర్..

Chaavu Kaburu Challaga
2020-09-22 13:20:01

ఆర్ఎక్స్ 100 సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన హీరో కార్తికేయ. దానికంటే ముందు ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమా చేశాడు కానీ అది ఎవరూ పట్టించుకోలేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో యువతలో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత గుణ 369, 90 ఎంఎల్ ఇలాంటి సినిమాలు చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతోపాటు నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా కూడా నటించాడు కార్తికేయ. ఇలాంటి సమయంలో గీతాఆర్ట్స్ ఇలాంటి పెద్ద సంస్థ నుంచి అవకాశం అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సినిమా చావు కబురు చల్లగా. ఇందులో శవాలను తీసుకెళ్లే వ్యాన్ డ్రైవర్ గా నటిస్తున్నాడు కార్తికేయ. సెప్టెంబర్ 21న పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. 

ఇందులో బస్తి బాలరాజు పాత్రలో నటిస్తున్నాడు కార్తికేయ. పూర్తిగా క్యారెక్టర్ లోకి దూరిపోయి ఊర మాస్ లుక్ లోకి వెళ్ళిపోయాడు ఈ హీరో. కొత్త దర్శకుడు కౌశిక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజు పండగే లాంటి బ్లాక్బస్టర్ సినిమాలు నిర్మించిన గీతా ఆర్ట్స్ 2 నుంచి ఈ సినిమా వస్తుండటంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కచ్చితంగా చావు కబురు చల్లగా తన కెరీర్ కు కావలసిన బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాడు కార్తికేయ. టీజర్ కూడా చాలా బాగా కట్ చేశాడు దర్శకుడు కౌశిక్. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అల్లు అరవింద్ చావు కబురు చల్లగా సినిమాకు సమర్పకుడిగా ఉన్నాడు. 

More Related Stories