English   

చావు క‌బురు చ‌ల్ల‌గా ట్రైలర్ టాక్ 

Chaavu Kaburu Challaga Trailer
2021-03-06 11:18:27

అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారు పేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా'. ‌ తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. అదిరిపోయే కామెడీ సీన్స్.. అద్భుతమైన ఎమోషన్.. మంచి కథతో అన్ని కమర్షియల్ హంగులు అద్దుకున్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 

పైన పటారం లోన లొటారం పాటల‌‌కు అనూహ్య స్పంద‌న ల‌భించింది. తాజాగా ట్రైలర్ కూడా అదే రకంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రికి మంచి రెస్పాన్స్ వస్తుంది. "ఆకలి నిద్ర మూర్ఖత్వం ఇవి కాకుండా.. జాలి దయ మానవత్వం అంటే ఏంటో తెలుసారా నీ మనస్సాక్షికి.. ""అమ్మాయిలందరూ ఎదవలకే పడతారంటారు.. అందులో నేను నెంబర్ వన్.. నన్ను మించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది నీకు.."" ఇందాక ఫోన్ లో చూసావే.. నాది యాక్టింగ్ మాత్రమే.. నువ్వు ఎక్కువ చేసావ్ అనుకో.. నీకు ఒరిజినల్ పడిపోద్ది.." అంటూ ట్రైలర్ లో వచ్చే డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తుంది.చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.

More Related Stories