English   

రేపే ఛల్ మోహన్ రంగా

Chal-Mohan-Ranga

ఛల్ మోహన్ రంగా రేపు విడుదల కావడం ఏంటీ.. ఏప్రిల్ 6న కదా అనుకుంటున్నారా..? అఫ్ కోర్స్.. అది నిజమే కావొచ్చు. కానీ రేపు విడుదల కాబోతోంది ఛల్ మోహన్ రంగా ఆడియో సాంగ్స్ రేపు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన మూడు పాటలూ ఉర్రూతలూపుతున్నాయ్. పెప్పీ నంబర్, రొమాంటిక్, మాస్ బీట్ ఇలా మూడు భిన్నమైన పాటలు వచ్చాయి. రేపు మిగతా పాటల్ని కూడా కలిపి మొత్తం పాటలు విడుదల చేయబోతున్నారు. ఈ పాటలన్నీ ఉదయం 9గంటలకే రిలీజ్ అవుతాయి. ఈ మధ్య యూత్ ఫుల్ ఆల్బమ్స్ తో అందరి హృదయాలు కొల్లగొట్టేస్తోన్న తమన్ సంగీతం అందించిన పాటలివి. ఆల్మోస్ట్ పాటలన్నీ క్యాచీగానే ఉంటాయని చెబుతున్నారు. 

లిరిసిస్ట్ నుంచి డైరెక్టర్ గా మారిన కృష్ణ చైతన్య ఛల్ మోహన్ రంగా కెప్టెన్. త్రివిక్రమ్ కథ అందించడం హైలెట్ అయితే త్రివిక్రమ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నిర్మిస్తోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ కూడా నిర్మాణ భాగస్వామి. ఇది నితిన్ 25వ సినిమా. ఇంతకు ముందు నితిన్ చేసిన రెండు సినిమాలూ అంచనాలు అందుకోలేకపోయాయి. అందుకే మరిన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ తెరకెక్కించారు. ఇక లై సినిమాలో అతనితో రొమాన్స్ చేసిన మేఘా ఆకాశ్ నే ఛల్ మోహన్ రంగాకు కంటిన్యూ చేశారు. ఇప్పటికైతే మంచి అంచనాలే ఉన్న ఈ మూవీకి సంబంధించి త్వరలోనే ప్రమోషన్స్ పెంచబోతున్నారు. ఏప్రిల్ 6న విడుదల కాబోతోంది.. కాబట్టి ఈ లోగా ప్రమోషన్స్ తో మరింత హైప్ పెంచేయొచ్చు. ఆల్రెడీ ఉగాది సందర్భంగా చేసిన ఇంటర్వ్యూ కూడా మంచి జోష్ గా ఉంది. ఏదేమైనా రంగస్థలం వచ్చిన వారానికే వస్తోన్న ఛల్ మోహన్ రంగా బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తాడా లేదా అనేది చూడాలి. 

More Related Stories