English   

ఛ‌ల్ మోహ‌న్ రంగా ఎలా ఉన్నాడంటే..!

Chal-Mohan-Ranga-Censor

నితిన్ కు ఇప్పుడు హిట్ చాలా అంటే చాలా అవ‌స‌రం. అ..ఆ లాంటి హిట్ సినిమా త‌ర్వాత వెంట‌నే లై లాంటి డిజాస్ట‌ర్ ఇచ్చాడు ఈ హీరో. ఈ చిత్రం క‌నీసం 10 కోట్ల మార్క్ కూడా అందుకోలేక చ‌తికిల‌ప‌డింది. సుకుమార్ త‌ర‌హాలో హ‌ను రాఘ‌వ‌పూడి చేసిన అర్థం కాని ప్ర‌యోగానికి ప్రేక్ష‌కులు దూరంగా జ‌రిగారు. దాంతో నితిన్ కెరీర్ కు లై రూపంలో భారీ దెబ్బ ప‌డింది. దాంతో ఇప్పుడు ఆ గాయం మాన్పించ‌డానికి త్రివిక్ర‌మ్ తో క‌లిసి సాఫ్ట్ ల‌వ్ స్టోరీ చేసాడు నితిన్. దీనికి కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌కుడు. అదే ఛ‌ల్ మోహ‌న్ రంగా. ఈ చిత్రం ఎప్రిల్ 5న విడుద‌ల కానుంది. తాజాగా ఈ చిత్ర సెన్సార్ పూర్తైంది. ఒక్క క‌ట్ కూడా లేకుండా క్లీన్ యు స‌ర్టిఫికేట్ అందుకుంది ఛ‌ల్ మోహ‌న్ రంగా. ఇది చాలు సినిమాల ఎలా ఉండ‌బోతుందో చెప్ప‌డానికి. సెన్సార్ స‌భ్యులు కూడా సినిమా చాలా బాగుందంటూ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. ఛ‌ల్ మోహ‌న్ రంగాలో ఉన్న‌ది ఒకే ఒక్క ఫైట్ సీన్. అది కూడా క‌థ‌కు చాలా కీల‌క‌మ‌ని పెట్టాడు ద‌ర్శ‌కుడు కృష్ణ‌చైత‌న్య‌. సినిమా అంతా స‌ర‌దాగా సాగిపోయే కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తుంది. ముఖ్యంగా నితిన్.. మేఘాఆకాశ్ మధ్య కెమిస్ట్రీ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ్తుంద‌ని న‌మ్ముతున్నారు చిత్ర‌యూనిట్. ప‌వ‌న్ తో క‌లిసి త్రివిక్ర‌మ్, నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మేఘా ఆకాశ్ గ్లామ‌ర్ కూడా సినిమాకు బాగా హెల్ప్ కానుంది. మొత్తానికి చూడాలిక‌.. ఛల్ మోహ‌న్ రంగాతో నితిన్ చేయబోయే మాయ ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories