English   

 ఛ‌ల్ మోహ‌న్ రంగా ఫ‌స్ట్ టాక్..హిట్ బొమ్మే..!

Chal-Mohan-Ranga
2018-04-05 07:12:03

ఛ‌ల్ మోహ‌న్ రంగా విడుద‌లైంది. నితిన్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని కృష్ణ‌చైత‌న్య తెర‌కెక్కించాడు. రౌడీఫెల్లో త‌ర్వాత ఆయ‌న గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. పైగా దీనికి త్రివిక్ర‌మ్ క‌థ అందించ‌డం.. ప‌వ‌న్ నిర్మాత‌గా ఉండ‌టంతో అంచ‌నాలు బాగానే పెరిగాయి. ఇప్పుడు ఈ చిత్రం విడుద‌లైంది. ఓవ‌ర్సీస్ లో ఇప్ప‌టికే ప్రీమియ‌ర్స్ ప‌డ్డాయి. అక్క‌డ్నుంచి వ‌స్తోన్న టాక్ ను బ‌ట్టి చూస్తుంటే నితిన్ కు మ‌ళ్లీ హిట్ ప‌డ్డ‌ట్లే అంటున్నారు అభిమానులు. ముఖ్యంగా సినిమా అంతా చాలా కూల్ గా వెళ్ల‌డ‌మే కాకుండా.. త్రివిక్ర‌మ్ మార్కు చ‌మ‌క్కులు చాలానే ఉన్నాయ‌ని తెలుస్తుంది. అజ్ఞాత‌వాసితో అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచిన గురూజీ.. ఇప్పుడు మాత్రం త‌న పెన్ ప‌వ‌ర్ తో ఛ‌ల్ మోహ‌న్ రంగాను నిల‌బెట్టాడు. త్రివిక్ర‌మ్ క‌థతో పాటు ఆయ‌న రాసిన కొన్ని డైలాగులు కూడా భ‌లేగా పేలాయంటున్నారు ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కులు. క‌చ్చితంగా ఛ‌ల్ మోహ‌న్ రంగా ఈ ఏడాదిలో మ‌రో హిట్ అవుతుంద‌ని.. నితిన్ కెరీర్ ను మ‌ళ్లీ గాడిన పడేసే సినిమా అవుతుంద‌ని తెలుస్తుంది. మొత్తానికి ఊహించిన‌ట్లే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వ‌చ్చేసింది. మ‌రి చూడాలిక‌.. మ‌న ద‌గ్గ‌ర ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories