English   

ఏయ్.. పవన్ కళ్యాణ్ మళ్లీ వస్తున్నాడు..?

Chal-Mohan-Ranga
2018-03-23 07:21:10

పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమైపోయాడు. ఇక సినిమాల గురించి పట్టించుకోడు... ఒక యేడాది పాటు వెండితెర జనంతో కూడా కలవడు అనేవార్తలు రెగ్యులర్ గా వింటున్నాం. కానీ పవన్ కళ్యాణ్ మళ్లీ వస్తున్నాడు. తను నిర్మించిన సినిమా.. తన అభిమాని నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహన్ రంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. అజ్ఞాతవాసి తర్వాత పవన్ అటెండ్ అవుతోన్న సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఈ సినిమాకు నిర్మాత కావడం వల్లే వస్తున్నాడు పవన్ అనేవారూ ఉన్నారు. ఛల్ మోహన్ రంగాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అండ్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన సినిమా. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ అందించాడు. కాబట్టి ఆయన కూడా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మరో చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. ఆ రకంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి ఒకేవేదికపై మరోసారి కనిపించబోతోన్న ఫంక్షన్ కూడా ఇదే. ఈ ఇద్దరూ తన మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ లు గా వస్తున్నారని ట్విట్టర్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు నితిన్. దీంతో ఇప్పటి వరకూ వచ్చిన హైప్ కంటే ఇప్పుడీ వార్తతో ఛల్ మోహన్ రంగాకు మరింత హైప్ వచ్చింది.  కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఛల్ మోహన్ రంగా నితిన్ కు 25వ సినిమా. మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది ఛల్ మోహన్ రంగా. ప్రస్తుతానికైతే ఈ మూవీపై పెద్దగా బజ్ లేదు. మరి పవన్, త్రివిక్రమ్ ల ప్రెజెన్స్ తో పాటు ఆ రోజు విడుదల చేయబోయే ట్రైలర్ తో అయినా ఈ మోహన్ రంగడికి క్రేజ్ పెరుగుతుందేమో చూడాలి. 

More Related Stories