English   

ప్రివ్యూ: చ‌ల్ మోహ‌న్ రంగా

Chal-Mohan-Ranga- Preview

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇప్పుడు రంగ‌స్థ‌లం సునామీ న‌డుస్తుంది. దాన్ని దాటుకుని నిల‌బ‌డాలంటే కాస్త క‌ష్ట‌మే. కానీ ట్రై చేస్తున్నాడు నితిన్. ఈయ‌న కొత్త సినిమా ఛ‌ల్ మోహ‌న్ రంగా ఎప్రిల్ 5న విడుద‌ల కానుంది. మ‌రికొన్ని గంట‌ల్లోనే సినిమా విడుద‌ల కానుంది. ముఖ్యంగా ఓవ‌ర్సీస్ లో ఎప్రిల్ 4 రాత్రి నుంచే ప్రీమియ‌ర్స్ భారీగా ప‌డుతున్నాయి. త్రివిక్ర‌మ్ పేరు ఉండటంతో అక్క‌డ సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. 140 లొకేష‌న్స్ లో చ‌ల్ మోహ‌న్ రంగా విడుద‌ల కానుంది. పైగా బిజినెస్ కూడా ఈ చిత్రానికి బాగానే జ‌రిగింది. త్రివిక్ర‌మ్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి పేర్లు ఉండ‌టంతో దాదాపు 15 కోట్ల‌కు పైగానే ఈ చిత్రాన్ని అమ్మేసారు. నితిన్ కు ఇప్పుడు హిట్ చాలా అంటే చాలా అవ‌స‌రం. అ..ఆ లాంటి హిట్ సినిమా త‌ర్వాత వెంట‌నే లై లాంటి డిజాస్ట‌ర్ ఇచ్చాడు ఈ హీరో. ఈ చిత్రం క‌నీసం 10 కోట్ల మార్క్ కూడా అందుకోలేక చ‌తికిల‌ప‌డింది. సుకుమార్ త‌ర‌హాలో హ‌ను రాఘ‌వ‌పూడి చేసిన అర్థం కాని ప్ర‌యోగానికి ప్రేక్ష‌కులు దూరంగా జ‌రిగారు. 

దాంతో నితిన్ కెరీర్ కు లై రూపంలో భారీ దెబ్బ ప‌డింది. దాంతో ఇప్పుడు ఆ గాయం మాన్పించ‌డానికి త్రివిక్ర‌మ్ తో క‌లిసి ఛ‌ల్ మోహ‌న్ రంగా అనే సాఫ్ట్ ల‌వ్ స్టోరీ చేసాడు నితిన్. కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌కుడు. ఈ మ‌ధ్యే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఒక్క క‌ట్ కూడా లేకుండా యు స‌ర్టిఫికేట్ ఇచ్చారు. ఛ‌ల్ మోహ‌న్ రంగాలో ఉన్న‌ది ఒకే ఒక్క ఫైట్ సీన్. అది కూడా క‌థ‌కు చాలా కీల‌క‌మ‌ని పెట్టాడు ద‌ర్శ‌కుడు కృష్ణ‌చైత‌న్య‌. సినిమా అంతా స‌ర‌దాగా సాగిపోయే కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తుంది. నితిన్.. మేఘాఆకాశ్ మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలైట్. ప‌వ‌న్ తో క‌లిసి త్రివిక్ర‌మ్, నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మేఘా ఆకాశ్ గ్లామ‌ర్ కూడా సినిమాకు బాగా హెల్ప్ కానుంది. మొత్తానికి చూడాలిక‌.. ఛల్ మోహ‌న్ రంగాతో నితిన్ చేయబోయే మాయ ఎలా ఉండ‌బోతుందో..?    

More Related Stories