English   

 ఛ‌ల్ మోహ‌న్ రంగా ట్రైల‌ర్ టాక్.. 

Chal-Mohan-Ranga
2018-03-26 11:42:44

నితిన్ సినిమా అంటే ముందుగా మ‌న‌కు గుర్తొచ్చేది రొమాన్స్.. ల‌వ్. సెకండ్ ఇన్నింగ్స్ లో మ‌నోడు ఎక్కువ‌గా ప్రేమ‌కే ఫిదా అయిపోతున్నాడు. కాక‌పోతే అప్పుడ‌ప్ప‌డూ లై అంటూ యాక్ష‌న్ వైపు వెళ్లి చేతులు మూతులు కూడా కాల్చుకుని మ‌ళ్లీ ప్రేమ వైపు వ‌స్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. ఛ‌ల్ మోహ‌న్ రంగా అంటూ అద్భుత‌మైన ప్రేమ‌క‌థ‌తో వ్చేసాడు నితిన్. ఈ సారి బోన‌స్ గా ఫుల్ కామెడీ కూడా తీసుకొస్తున్నాడు నితిన్. తాజాగా విడుద‌లైన ఛ‌ల్ మోహ‌న్ రంగా ట్రైల‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ లో కాస్త కామెడీ ట‌చ్ చేసిన ద‌ర్శ‌కుడు.. ఈ సారి మాత్రం కుమ్మేసాడు. కొత్త‌గా అనిపించ‌లేదు కానీ.. చాలా రీ ఫ్రెషింగ్ గా అనిపించింది ట్రైల‌ర్. ప‌వ‌న్ క‌ళ్యాన్ క్రియేటివ్ వ‌ర్క్స్ కు తోడు త్రివిక్ర‌మ్, సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నితిన్ ఈ చిత్రంలో చాలా అందంగా క‌నిపిస్తున్నాడు. అ..ఆ ఫేమ్ న‌ట‌రాజ్ సుబ్ర‌మ‌ణ్య‌న్ సినిమాటోగ్ర‌ఫీ ట్రైల‌ర్ స్థాయిని పెంచేసింది. అద్భుత‌మైన విజువ‌ల్స్ తో అందంగా తెర‌కెక్కించాడు కృష్ణ‌చైత‌న్య‌. అమెరికాలోనే ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ‌గా జ‌రిగింది. ఈ చిత్రం ఎప్రిల్ 5న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన అన్ని పాట‌లు అదిరిపోయాయి. ఇక జై చిరంజీవ త‌ర్వాత బ‌య‌టి  ద‌ర్శ‌కుడికి త్రివిక్ర‌మ్ క‌థ ఇవ్వ‌డం ఇదే తొలిసారి. మ‌రి నితిన్ కోసం ఇంత చేస్తుంటే.. ఆయ‌న వీళ్ల‌కు తిరిగి ఏం చేస్తాడో చూడాలిక‌..!

More Related Stories