English   

న‌టుడు చ‌ల‌ప‌తిరావుకు ప్ర‌మాదం.. 

Chalapathi-Rao

సీనియ‌ర్ న‌టుడు.. 50 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్న చ‌ల‌ప‌తిరావుకు భారీ ప్ర‌మాదం త‌ప్పింది. ఈయ‌న చిన్న గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఈయ‌న ఆర్ఎఫ్ సీలో ఓ సినిమా షూటింగ్ లో ఉండ‌గా గాయ‌ప‌డ్డారు. ఫిల్మ్‌సిటీలో షూటింగ్ చేస్తుండగా బస్సు వెనుక నిచ్చెన ఎక్కుతుండగా చలపతిరావు జారి కింద పడ్డారు. దీంతో ఆయన్ను వెంటనే స‌మీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చలపతిరావు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్ఎఫ్సీలో అల్లరి నరేష్‌ సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది. చ‌ల‌ప‌తిరావు ఆరోగ్యం గురించి ఇండ‌స్ట్రీలో ప‌లువురు ఆరా తీసిన‌ట్లుగా తెలుస్తుంది. అయితే ఈయ‌న ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవ‌స‌రం లేద‌ని.. ఆయ‌న బాగానే ఉన్నార‌ని చెబుతున్నారు డాక్ట‌ర్లు. సినిమా యూనిట్.. చలపతిరావు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. చలపతిరావు ఆరోగ్య ప‌రిస్థితిపై అల్ల‌రి న‌రేష్ కూడా ఆరా తీస్తున్నారు. ప్ర‌స్తుతం హాస్పిట‌ల్లో చ‌ల‌ప‌తిరావు కుమారుడు ర‌విబాబు ఉన్నారు. వారం రోజుల పాటు ఆయ‌న‌కి రెస్ట్ ఇచ్చారు డాక్ట‌ర్లు. త‌ర్వాత మ‌ళ్లీ షూటింగ్ లో పాల్గొన‌నున్నారు. 

More Related Stories