English   

నో డౌట్స్.. ఛ‌లో ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ @ 2018..

Chalo-talk
2018-03-16 16:46:56

ఇక ఇప్పుడు ఎవ‌రికీ అనుమానాల్లేవు. ఇప్ప‌టి వ‌ర‌కు 2018లో చాలా సినిమాలు వ‌చ్చాయి. ఏడాది వ‌చ్చి కూడా 70 రోజులు అయిపోయిందపుడే. ఇప్ప‌టికీ చాలా సినిమాలు కూడా విడుద‌ల‌య్యాయి. అందులో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి కానీ బ్లాక్ బ‌స్ట‌ర్ అనే క‌ల మాత్రం తీర‌లేదు. కానీ ఇప్పుడు ఆ మూవెంట్ వ‌చ్చేసింది. ఓ చిన్న సినిమానే ఎదురుచూపుల‌ను నెర‌వేర్చింది. సంక్రాంతికి వ‌చ్చిన ఏ సినిమా కూడా సూప‌ర్ హిట్ రిజ‌ల్ట్ కూడా అందుకోలేదు. జై సింహా ఓకే అనిపించింది.. అజ్ఞాత‌వాసి అడ్ర‌స్ గ‌ల్లంత‌యింది.. గ్యాంగ్ జ‌స్ట్ ఓకేతో వెళ్లిపోయింది.. రంగుల రాట్నంకు అన్ని రంగులు క‌లిసి క‌నిపించాయి. ఇలాంటి టైమ్ లో వ‌చ్చిన భాగ‌మ‌తి హిట్ అయింది. ఈ చిత్రానికి వ‌సూళ్లు బాగానే వ‌చ్చినా కూడా అమ్మిన రేట్ల ప్ర‌కారం.. చేసిన బిజినెస్ ప్ర‌కారం హిట్ అయింది కానీ బ్లాక్ బ‌స్ట‌ర్ కాలేదు. 32 కోట్లు వ‌చ్చినా కూడా 30 కోట్ల‌కు అమ్మారు భాగ‌మ‌తిని. దాంతో హిట్ ద‌గ్గ‌రే ఆగి.. బ్లాక్ బ‌స్ట‌ర్ కు దూరంగా జ‌రిగింది. 

ఇలాంటి టైమ్ లో వ‌చ్చిన ఛ‌లో ఈ ఏడాదికి తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ర‌వితేజ ట‌చ్ చేసి చూడును పూర్తిగా డామినేట్ చేసి విన్న‌ర్ గా నిలిచింది ఈ చిత్రం. ఇప్పుడు ఈ చిత్ర ఫుల్ ర‌న్ క‌లెక్ష‌న్స్ బ‌య‌టికి వ‌చ్చాయి. ఈ చిత్రం 12.80 కోట్లు వ‌సూలు చేసింది. అది కూడా షేర్. నాగ‌శౌర్య కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్. అంతేకాదు.. లాభాల ప‌రంగా చూస్తే ఈ చిత్రం ఈ ఏడాదిలోనే పెద్ద హిట్. 6 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం.. ఫుల్ ర‌న్ లో 13 కోట్ల వ‌ర‌కు షేర్ వ‌సూలు చేసింది. ఈ చిత్రానికి నిర్మాత కూడా నాగ‌శౌర్య‌. వాళ్ల అమ్మ ఉషా మ‌ల్పూరి ఛ‌లో చిత్రాన్ని నిర్మించారు. ఏది ఎలాగున్నా ఛ‌లో రూపంలో 2018 తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. తొలిప్రేమ హిట్ అయినా కూడా అది బ్లాక్ బ‌స్ట‌ర్ కాదు. దాంతో ఛ‌లో పంట పండింది. 

More Related Stories