English   

 చాణక్య రివ్యూ

Chanakya
2019-10-05 14:35:14

గోపిచంద్ సినిమాలంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలకు ఈయన పెట్టింది పేరు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేస్తుంటాడు ఈయన. ఇప్పుడు చాణక్య సినిమాతో వచ్చాడు. మరి ఇది ఎలా ఉందో చూద్దాం.. 

కథ:

అర్జున్(గోపిచంద్) రా ఏజెంట్. పాకిస్తాన్ వెళ్లి అక్కడ టెర్రరిజం కోవర్ట్ ఆపరేషన్ చేస్తుంటాడు. ఇండియన్ రీసెర్చ్ అండ్ వింగ్ ఉడెర్ కవర్ ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. అయితే రా ఏజెంట్ అని చెప్పకుండా బయట మాత్రం బ్యాంకు ఉద్యోగిగా ఉంటాడు. అప్పుడే మెహ్రీన్ పరిచయం అవుతుంది. ఆమె ప్రేమలో పడతాడు అర్జున్. ఆ తర్వాత అనుకోని క్రమంలో ఓ టెర్రరిస్ట్ ను పట్టుకోడానికి పాక్ వెళ్లాల్సి వస్తుంది. అతడే వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఖురేషి. ఈ క్రమంలోనే అక్కడి టెర్రరిస్టులను అర్జున్ చంపేస్తాడు. అది చూసి తట్టుకోలేని ఖురేషి కోడుకు సోహైల్.. అర్జున్ టీంను కిడ్నాప్ చేస్తాడు. అప్పుడు పాకిస్తాన్ వెళ్లి అక్కడ తన టీంను అర్జున్ ఎలా కాపాడుకుంటాడు అనేది కథ.. 

కథనం:

టెర్రరిజం బ్యాక్ డ్రాప్ సినిమాల్లో కథ ఏంటి అనేది అడక్కూడదు. అన్ని సినిమాలు ఒకేలా ఉంటాయి. స్క్రీన్ ప్లే మాత్రమే కొత్తగా ఉంటుంది. తిరు కూడా ఇదే చేయాలనుకున్నాడు. చాణక్య కథ కొత్తదేం కాదు. తెలిసిన కథే.. కాకపోతే కథనం కూడా వీక్ గా ఉండటం ఈ సినిమాకు మైనస్. స్పై థ్రిల్లర్ అన్నపుడు సీన్స్ అన్నీ ఆసక్తికరంగా ఉంటాయని ఊహిస్తాం. కానీ ఫస్టాఫ్ అంతా సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. ముఖ్యంగా హీరోను అలాంటి పాత్రలో చూపిస్తూ.. వెంటనే లవ్ ట్రాక్ అంటూ పాటలను ఇరికిస్తే ఊహించుకోవడం కష్టమే. కానీ మెహ్రీన్ ను తీసుకున్నందుకు కథను పక్కనబెట్టి మరీ పాటలు పెట్టాడు దర్శకుడు. ఇక హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా కుదర్లేదు. పైగా కుక్క కామెడీ అయితే సహనానికి పరీక్ష కాదు.. చిరాకు పెట్టిస్తుంది. కథ ముందుకు వెళ్తున్న సమయంలో హీరోయిన్ రావడం.. కామా పెట్టడం కామన్ గా జరిగింది ఫస్టాఫ్ లో. సెకండాఫ్ అంతా పాకిస్తాన్ కు కథ షిఫ్ట్ అవుతుంది. అక్కడ కాస్త ఇంట్రెస్టింగ్ గానే అనిపించినా కూడా అక్కడక్కడా అనవసరపు సన్నివేశాలు సహనాన్ని పరీక్షిస్తాయి. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ బాగుంటుంది. యాక్షన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ట్విస్టులు కూడా బాగానే ఉన్నాయి. జరీన్ ఖాన్ వచ్చిన తర్వాత కథ బాగానే మలుపులు తిరుగుతుంది. అయితే అంత పెద్ద టెర్రరిస్ట్ ను హీరో ఒక్కడే వెళ్లి ఎలా కావాలంటే అలా ఆడుకోవడం.. పట్టుకోవడం అనేది లాజిక్ కు అందని విషయం. క్లైమాక్స్ అయితే మరీ ఈజీగా తేల్చేసాడు దర్శకుడు. తిరు గత సినిమాలతో పోలిస్తే చాణక్య అంచనాలు అందుకోలేదు. అక్కడక్కడా యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి పర్లేదు అనిపిస్తుందంతే. 

నటీనటులు:

గోపీచంద్ మరోసారి మాయ చేసాడు. రా ఏజెంట్ గా అద్భుతంగా నటించాడు. ఆయనకు ఇలాంటి పాత్రలు కొత్తేం కాదు. పాకిస్తాన్ లో షూట్ చేయడం మాత్రం సాహసమే. మెహ్రీన్ పాటలకు పరిమితం అయింది. విలన్స్ పాత్రల్లో ఇద్దరు డాన్స్ తేలిపోయారు. పెద్దగా ఆకట్టుకోలేదు. అలీ, రఘుబాబు, సునీల్ అక్కడక్కడా నవ్వించారు. జరీన్ ఖాన్ బాగా నటించింది. ఆమె కీలకపాత్రలో కనిపించింది. 

టెక్నికల్ టీం:

వెట్రి సినిమాటోగ్రఫీ బాగుంది. పాకిస్తాన్, జై సల్మీర్ ప్రదేశాలు బాగా చూపించాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఆకట్టుకోలేదు. అయితే ఆర్ఆర్ బాగుంది. ఎడిటింగ్ చాలా వీక్. ఫస్టాఫ్ సహనానికి పరీక్ష. తమిళ దర్శకుడు కావడంతో తెలుగు ప్రేక్షకుల మనసు అర్థం చేసుకోవడంలో తిరు విఫలమయ్యాడు. ఫస్టాఫ్ రొడ్డకొట్టుడు సీన్స్ పెట్టి విసుగు పుట్టించాడు. సెకండాఫ్ అసలు కథ మొదలైనా అప్పటికే సినిమాపై బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. 

చివరగా:  చాణక్య.. రొటీన్ స్పై యాక్షన్ డ్రామా.. 

రేటింగ్ : 2/5

More Related Stories