English   

మెగా మేన‌ల్లున్ని ఆయ‌నేం చేస్తాడో..?

Chandra Sekhar Yeleti and sai dharamtej
2018-02-18 17:23:36

అస‌లే ఇప్పుడు కెరీర్ ఎటు వెళ్తుందో తెలియ‌ని అయోమ‌య స్థితిలో ప‌డిపోయాడు సాయిధ‌రంతేజ్. ఒక్క‌టా రెండా.. ఏకంగా ఐదు వ‌ర‌స ఫ్లాపుల‌తో మ‌నోడి కెరీర్ దారుణ‌మైన స్థితిలో ఉందిప్పుడు. ఆయ‌న నుంచి సినిమా వ‌చ్చిందంటే ఫ్లాప్ అని ముందే ఫిక్స్ అయిపోతున్నారు ప్రేక్ష‌కులు. కెరీర్ మొద‌ట్లో వ‌ర‌స విజ‌యాలు అందుకున్న సాయి.. ఇప్పుడు వ‌ర‌స డిజాస్ట‌ర్ల‌తో హోరెత్తిస్తున్నాడు. మొన్నొచ్చిన ఇంటిలిజెంట్ సైతం డిజాస్ట‌రే. వినాయ‌క్ బ్రాండ్ ఉన్నా కూడా ఈ చిత్రానికి క‌నీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. అస‌లు ఇదో సినిమానా అంటూ ప్రేక్ష‌కులు బూతులు కూడా తిట్టేసు కున్నారు. ఇలాంటి టైమ్ లో కొత్త‌గా ప్ర‌య‌త్నిస్తే త‌ప్ప గుర్తింపు రాద‌నుకున్నాడో ఏమో కానీ ఇప్పుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటితో సినిమా క‌మిట్ అవుతున్నాడు సాయిధ‌రంతేజ్. అస‌లు ఈయ‌న‌తో సినిమా అంటేనే క‌మ‌ర్షియ‌ల్ విజ‌యంపై ఆశ‌లు పెట్టుకోకూడ‌దు. కానీ మంచి సినిమా ఇస్తాడు అనే న‌మ్మ‌కం పెట్టుకోవ‌చ్చు. ఇప్పుడు సాయికి విజ‌యం కంటే విమ‌ర్శ‌లు త‌ప్పించుకోవ‌డ‌మే కావాలేమో మ‌రి..? 
చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్ళైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ కెరీర్ లో ఈయ‌న చేసిన సినిమాలు అర‌డ‌జ‌నే. ఇందులో క‌మ‌ర్షియ‌ల్ గా ఆడిన‌వి లెక్క పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. రెండేళ్ల కింద వ‌చ్చిన మ‌న‌మంతా కూడా విమ‌ర్శకుల ప్ర‌శంస‌ల ద‌గ్గ‌రే ఆగిపోయింది. ఇలాంటి టైమ్ లో ఈయ‌నతో సినిమాకు సాయిధ‌రంతేజ్ ముంద‌డుగేస్తున్నాడు. ఈ కాంబినేష‌న్ లో ఊహించ‌డానికే క‌ష్టంగా ఉంది. కానీ ఇప్ప‌టికే సాయికి యేలేటి క‌థ చెప్ప‌డం.. అది మెగా మేనల్లుడికి న‌చ్చ‌డం కూడా జ‌రిగాయ‌ని తెలుస్తుంది. ఈ సినిమాలో రుక్స‌ర్ మీర్ హీరోయిన్ గా న‌టించ‌నుంది. ఈమె ప్ర‌స్తుతం నాని న‌టిస్తున్న కృష్ణార్జున యుద్ధంలో ఓ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇక సాయి ప్ర‌స్తుతం క‌రుణాక‌ర‌ణ్ తో సినిమా పూర్తి చేస్తున్నాడు. ఆ త‌ర్వాత చంద్ర‌శేఖ‌ర్ యేలేటి సీన్ లోకి రావ‌చ్చు. మ‌రి చూడాలిక‌.. ఈ కాంబినేష‌న్ ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories