English   

ఆ టాలెంటెడ్ డైరెక్టర్ మళ్లీ వస్తున్నాడు

chandra siddartha coming back
2018-06-02 20:13:57

చంద్రసిద్ధార్థ్.. కమర్షియల్ గా పెద్ద హిట్లు లేవు కానీ.. హార్ట్ టచింగ్ మూవీస్ తీయడంలో చంద్రసిద్ధార్థ్ ది బెస్ట్ అని ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు. వైవిధ్యమైన కథల్లో హ్యూమన్ ఎమోషన్స్ ను మిక్స్ చేసి ఆకట్టుకునే ఈ దర్శకుడు గత కొన్నాళ్లుగా సరైన సినిమాలు కూడా అందించలేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో తనికెళ్లభరణి శివశతకం లోని ఆఖరి లైన్ ను టైటిల్ గా పెట్టుకుని కొత్త సినిమాతో రాబోతున్నాడు. ‘ఆటగదరా శివ’ ఇదీ ఆ టైటిల్. తనికెళ్ల భరణి రాసిన శివశతకంలోని ప్రతి పద్యం ఈ పాదంతోనే అంతం అవుతుంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమాను కన్నడ బిగ్ ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తుండటం. 

ఇక టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈసినిమా పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు కన్నడలోనూ ఏకకాలంలో రూపొందే ఈ సినిమాతో చంద్రసిద్ధార్థ్ ఓ యూనిక్ సబ్జెక్ట్ ను చెప్పబోతున్నాడనే ప్రచారం ఉంది. మరి ఈ సినిమాతో చంద్రసిద్ధార్థ్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడా అనేది చూడాలి. 

More Related Stories