English   

ఆ ద‌ర్శ‌కుడితో నాని సినిమా చేస్తున్నాడా..?

Chandrasekhar-Yeleti

నాని ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోతున్నాడు. ఓ ప‌క్క బిగ్ బాస్ 2 చేస్తూనే మ‌రో వైపు వ‌ర‌స సినిమాల‌ను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పుడిప్పుడే త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చిన క‌థ‌ల్లో కొన్ని ఎంచుకోవ‌డం మొద‌లుపెట్టాడు. శ్రీ‌రామ్ ఆదిత్య సినిమా చేస్తున్న‌పుడు త‌ర్వాతి సినిమా కోసం కాస్త టైమ్ తీసుకున్నాడు ఈ హీరో. అయితే కుర్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ చెప్పిన క‌థ న‌చ్చి జెర్సీ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు. ఇక ఇప్పుడు మ‌రో క‌థ‌ను కూడా నాని ఫైన‌ల్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో నాని న‌టించ‌బోతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుందిప్పుడు. 

ఈ ద‌ర్శ‌కుడు కొన్ని రోజులుగా క‌థ ప‌ట్టుకుని హీరోలంద‌రి ద‌గ్గ‌రికి తిరుగుతున్నాడు. ముందు గోపీచంద్ అనుకున్నాడు.. ఆ త‌ర్వాత సాయిధ‌రంతేజ్ సీన్ లోకి వ‌చ్చాడు.. ఆ వెంట‌నే నితిన్ కూడా క‌థ విన్నాడు.. కానీ ఎవ‌రూ ధైర్యం చేయ‌లేక‌పోయారు. యేలేటి సినిమాలు బాగున్నాయంటారు కానీ డ‌బ్బులు మాత్రం రావు. దాంతో హీరోలెవ‌రూ క‌మ‌ర్షియ‌ల్ రేంజ్ లేకుండా సాహ‌సం చేయ‌డానికి ముందుకు రావ‌డం లేదు. దాంతో ఇప్పుడు ఇదే క‌థ‌ను నాని చెబితే ఆయ‌న ఓకే అన్న‌ట్లు తెలుస్తుంది. నాని ఉన్నాడంటే ఆటోమేటిక్ గా క‌మ‌ర్షియ‌ల్ రేంజ్ పెరుగుతుంది. దానికితోడు యేలేటి సినిమా అంటే క‌నీసం బాగుంటుంద‌నే టాక్ ఉంది. అందుకే క‌థ న‌చ్చ‌డంతో రిస్క్ అని తెలిసినా కూడా ఈ ద‌ర్శ‌కుడికి ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి చూడాలిక‌.. నిజంగానే చంద్ర‌శేఖ‌ర్ యేలేటితో ఈ హీరో సినిమా చేస్తాడో లేదో..?

More Related Stories