English   

చరణ్ విలన్ చాలా కాస్ట్ లీ గురూ..

ram charan

నీ ఫ్రెండ్స్ తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. అదే నీ ఎనిమీ ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది.. రామ్ చరణ్ ధృవ సినిమాలోనిదీ డైలాగ్. నిజమే.. సినిమాల్లో విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరోయిజం అంత ఎలివేట్ అవుతుంది. ఇక బోయపాటి సినిమాల్లోని విలన్స్ ఎలా ఉంటారో తెలుసు కదా. ఆ కారణంగానే ఆయన సినిమాల్లో హీరోయిజం పీక్స్ లో ఉంటుంది. ఇందుకోసం ఏరికోరి మరీ విలన్స్ ను సెలెక్ట్ చేసుకుంటాడు బోయపాటి. ప్రస్తుతం రామ్ చరణ్ తో చేయబోతోన్న సినిమా కోసం కూడా ఓ క్రేజీ ఆర్టిస్ట్ ను విలన్ గా తీసుకుంటున్నాడు. కానీ ఇందుకోసం అతను కోట్ చేస్తోన్న రెమ్యూనరేషన్ చూస్తే షాక్ అవుతాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో విలన్ పాత్రకూ చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. ఇప్పటికే సౌత్ లో చాలామంది ఆర్టిస్టుల్ని విలన్స్ గా మార్చాడు బోయపాటి. అందుకే ఈ సారి బాలీవుడ్ కు వెళ్లాడు. బాలీవుడ్ ది బెస్ట్ ఆర్టిస్ట్ అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్ ని విలన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ మూవీలో అతని పాత్ర హీరోకు సమానంగా పవర్ ఫుల్ గా ఉంటుందట.చరణ్ కు విలన్ అతనే సరైనోడు అని ఫిక్స్ అయ్యాడు బోయపాటి. కానీ అందరూ సౌత్ ఆర్టిస్టుల్లానే ఉండరు కదా. అందుకే వివేక్ ఏకంగా మూడు కోట్లు అడిగాడట. తెలుగులో ఓ విలన్ కు ఇది చాలా పెద్ద మొత్తం. అయినా విలన్ పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ తో పాటు ఫ్రెష్ నెస్ కోసమూ నిర్మాతతో ఈ మూడుకోట్లకు ఓకే చేయించాడట బోయపాటి. నిజానికి నిర్మాత ధైర్యం కూడా బోయపాటే అని చెబుతున్నారు. అలాగే హీరోయిన్ గా నటిస్తోన్న కైరా అద్వానీకి కూడా భారీగానే ముట్టచెప్పినట్టు టాక్. మొత్తంగా ఇది భారీ బడ్జెట్ సినిమా అనేది తేలిపోయింది. మరి ఆ భారీ మొత్తం రికవర్ చేసే బాధ్యత బోయపాటిపైనే ఉంది. 

More Related Stories