English   

నేను పెళ్లికి పనికిరాను

Charmy-Kapoor

అంటోంది ఛార్మీ.. తను మేరేజ్ మెటీరియల్ కాదని ఒప్పేసుకుంటోంది. మరి ఏమీ కాకుండానే ఇంత వైరాగ్యం రాదు కదా. కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకరితో లవ్వాయణం నడిపిందనే రూమర్స్ ఉండేవి. ఆ వ్యవహారం బెడిసికొట్టిన తర్వాత చార్మీ కెరీర్ తెగిన గాలిపటం అయింది. ఎలాగోలా ఆ గాలిపటానికి ఓ దారం ముడేసుకుని ఇప్పుడు పూరీ జగన్నాథ్ క్యాంప్ లో సెటిల్ అయిందీ పాప. లేటెస్ట్ గా చార్మీకి సంబంధించి పెళ్లి మేటర్ ప్రస్తావనకు వచ్చింది. అది కూడా ఆమెదగ్గరే. అప్పుడే అమ్మడు తాను పెళ్లికి పనికి రానని చెప్పింది. అంతే కాదు. బయటి వ్యక్తి తనను ప్రశ్నిస్తే తనకు నచ్చదనీ, అతను భర్త అయినా సరే భరించలేను అనేసింది. మరి ఆయనెందుకు ప్రశ్నిస్తాడు అంటే.. నేను ఇంటిపట్టునే కూర్చునే టైప్ కాదు. ఫ్రెండ్స్ తో తిరుగుతుంటాను. ఇది ఏ భర్తకూ నచ్చదు. అందుకే నాకూ భర్త నచ్చడు అనేసింది. పన్లో పనిగా గతంలో తానూ ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. కానీ అది గతం. అయినా ఆ వ్యక్తి చాలా మంచోడు అని కితాబిచ్చేసింది. మొత్తంగా తానసలు పెళ్లే చేసుకోను అంటూ.. పూరీ క్యాంప్ లో సెటిల్ అయిన ఛార్మీ పెళ్లి గురించి ఇలా మాట్లాడ్డం మాత్రం సంచలనంగానే మారింది.

More Related Stories