English   

నితిన్ చెక్ 4డేస్ కలెక్షన్స్

Check
2021-03-03 11:15:43

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం చెక్. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్ లుగా నటించారు. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 26న విడుదలయ్యింది. అయితే సినిమాకు ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ రాబట్టడంలో విఫలమయ్యింది. ఇక ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్ ల వివరాలను గమనిస్తే...ఈ సినిమాకు 16. 10 కోట్ల బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.16.60 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కాగా నాలుగు రోజులు పూర్తయ్యేసరికి కేవలం 8.29 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో రూ.8.31 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక మొదటి సోమవారం ఈ సినిమా కేవలం 0.53 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఇప్పటివరకు 50 శాతం కూడా రికవరీ చేయని ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమనే చెప్పాలి.

More Related Stories