English   

చెర్రీ సినిమా ఆగిపోవ‌డానికి కార‌ణం స‌మంత‌నా?

Cherry-cinema-Agipovadaniki-Karanam-Samanthana
2017-04-28 04:31:47

అనుకున్న దానికంటే రెండు రోజుల ముందే రామ్‌చ‌ర‌ణ్ సినిమా చిత్రీక‌ర‌ణ ఆపేశారు. అభిమానుల తాకిడి ఎక్కువైంద‌ని సినిమా తొలి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ఆపేశామ‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. అయితే సినిమా షూటింగ్ ఆగిపోవ‌డానికి కార‌ణం అభిమానులు కాద‌ట‌... స‌మంతన‌ట‌. అవును స‌మంత వ‌ల్లే సినిమా ఆగిపోయింది.

ఎండ‌లు మండిపోతున్నా రామ్‌చ‌ర‌ణ్, స‌మంత త‌దిత‌రులు గ‌త కొన్ని రోజులుగా కొల్లేరు ప్రాంతంలో చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. ఎండ‌ల్లో వారి ప‌రిస్థితి ఎలా ఉందో మొన్నామ‌ధ్య చ‌ర‌ణ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు చూస్తే తెలుస్తుంది. అలాంటి ప‌రిస్థితిలో స‌మంత ఇంకెంత ఇబ్బంది పడుంటుందో ఆలోచించండి. ఎండ వేడిమికి త‌ట్టుకోలేక వ‌డ‌దెబ్బ త‌గిలి అస్వ‌స్థ‌త‌కు గురైంద‌ట‌. ఓ రెండు గంటల్లో కోలుకొని చిత్రీక‌ర‌ణ‌కు సిద్ధ‌మైనా చ‌ర‌ణ్, ద‌ర్శ‌కుడు సుకుమార్‌ స‌సేమిరా ఒప్పుకోలేద‌ట‌. ముందు ఆరోగ్యం త‌ర్వాత సినిమా చిత్రీక‌ర‌ణ అని అన్నార‌ట. దీంతో చిత్రీక‌ర‌ణ ఆగిపోయింద‌ట‌. ఎలాగూ వ‌చ్చే నెల మ‌ళ్ళీ అక్క‌డే చిత్రీక‌ర‌ణ ఉంది కాబ‌ట్టి తీసుకుందాం అనుకున్నార‌ట‌. అయితే మ‌రి సినిమా ఆగిపోవ‌డానికి అభిమానుల తాకిడే కార‌ణ‌మని ఎందుకు చెప్పారో అర్థం కావ‌డం లేదు.

More Related Stories