English   

అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు లక్ష్మి

Chi-La-Sow

సుశాంత్ హీరోగా రూపొందుతోన్న కొత్త సినిమా చి.ల.సౌ మూవీ టీజర్ విడుదలైంది. అందాల రాక్షసి లో ఒక హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ టీజర్ ను సమంత చేతుల మీదుగా విడుదల చేశారు. అయితే గతంలో కూడా ఓ టీజర్ వచ్చింది. అయితే ఈ సారి టీజర్ లో హీరోయిన్ ను పరిచయం చేశారు. ఈ భామ పేరు రుహానీ శర్మ. చూడగానే ఆకట్టుకునేలా ఉందీ బ్యూటీ. కాకపోతే కాస్త షార్ట్ ఫిలిమ్ లుక్ కనిపించిదీ టీజర్ లో. 

ఒకే షాట్ లో తీసిన వీడియోను టీజర్ గా విడుదల చేసినట్టు కనిపిస్తోంది. కంప్లీట్ క్లోజప్ షాట్స్ ను మాత్రమే తీసుకున్నారీ టీజర్ లో. అందుకే అమ్మాయి ఇంకా బాగా నచ్చిందేమో.. ఇక అదే షాట్ లో తను చెప్పిన డైలాగ్ అదిరిపోయిందంతే.. ప్రతి ఒక్కడికీ కత్రినా కైఫ్ కావాలి.. బట్ ఎవడూ రణ్ బీర్ లా ఉండడు.. ఇదీ టీజర్ లో డైలాగ్. ఈ డైలాగ్ విన్న తర్వాత తెలిసేదేంటంటే.. సమంత ఎందుకు వచ్చిందా అని.. సమంత రావడానికి కేవలం అక్కినేని ఫ్యామిలీకీ చెందిన సుశాంత్ మాత్రమే కారణం కాదు.. ఈ సినిమాలో హీరోయిన్ కు డబ్బింగ్ చెప్పింది చిన్మయి. యస్ ఇన్నాళ్లూ సమంతకు డబ్బింగ్ చెప్పిన తనే ఈ మూవీలో హీరోయిన్ కూ డబ్బింగ్ చెప్పింది. తను రావడానికి ఇది కూడా ఓ కారణం అనుకోవచ్చు. మొత్తంగా ఆ మధ్య చిరంజీవిని.. ఇప్పుడు లక్ష్మీ సౌభాగ్యవతిని పరిచయం చేసి ఆకట్టుకున్నాడు రాహుల్ రవీంద్రన్. 

More Related Stories